రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే

రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే

ఖిలా వరంగల్, వెలుగు : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో వరంగల్– ఖమ్మం ప్రధాన రహదారిపై నీరు చేరి, రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి రోడ్డుకు ఇరువైపులా నీరును మళ్లించి ట్రాఫిక్ ను క్లియరెన్స్ చేయించారు. కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ ఈదుర్ల అరుణ విక్టర్, మాజీ జడ్పీటీసీ కమ్మగొని ప్రభాకర్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.