వర్ధన్నపేట, వెలుగు: ఎస్సీ వర్గీకరణను ఒప్పుకొని అమలు చేసే పార్టీకే మాదిగల మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. నవంబర్ మొదటి వారంలో హైదరాబాద్ లో మాదిగల విశ్వరూప మహాసభ నిర్వ హిస్తున్న నేపథ్యంలో సోమవారం ఆయన వర్ధన్నపేట లో ఏర్పాటు చేసిన సన్నాహక సద స్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పిన సీఎం కేసీఆర్, ఆరేళ్లైనా ఆ ఊసే ఎత్త కపోవడం దారుణమని మండిపడ్డారు.
తెలంగా ణా లో మాదిగ బిడ్డలను కేసీఆర్ సర్కార్ అణగదొక్కుతోం దని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పు డు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ వర్గీకరణకు అను కూలంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. వర్గీకరణకు మద్దతివ్వని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మాదిగలు ఎందుకు ఓటేయాలని సూటి గా ప్రశ్నించారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతోందన్న ఆయన, పార్లమెంటులో బిల్లు పెట్టి చిత్తశుద్ది చూపించు కోవాలన్నారు.
ఎస్సీ నియోజకవర్గాల్లో వర్గీకరణకు అనూకలంగా ఉన్న పార్టీకే మాదిగలు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ సాధన సమితి ఛైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు కట్ల రాజశేఖర్, సంకినేని వెంకట్ మాదిగ, ఐత రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ సాధన సమితి ఛైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు కట్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.