న్యూఢిల్లీ: సోలార్ ప్యానెల్ తయారీ సంస్థ వారీ ఎనర్జీస్ బుధవారం తన రూ. 4,321 కోట్ల విలువైన ఐపీఓ కోసం ఒక్కో షేరుకు రూ. 1,427 నుంచి రూ. 1,503 ధరను నిర్ణయించినట్లు తెలిపింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) అక్టోబర్ 21న మొదలై అక్టోబర్ 23న ముగుస్తుంది.
యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ అక్టోబర్ 18న ఉంటుంది. ఈ ఐపీఓలో రూ. 3,600 కోట్ల తాజా ఇష్యూతోపాటు రూ. 721.44 కోట్ల విలువైన 48 లక్షల ఓఎఫ్ఎస్ ఉంటుంది. సంస్థ ఉద్యోగుల కోసం రూ.65 కోట్ల విలువైన షేర్లను రిజర్వ్ చేశారు.
ఓఎఫ్ఎస్ కింద, ప్రమోటర్ వారీ సస్టైనబుల్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, చందూర్కర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లను ఆఫ్‌లోడ్ చేస్తున్నాయి. తాజా ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒడిశాలో 6 గిగావాట్ల ఇంగోట్ వేఫర్, సోలార్ సెల్ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తారు. కొంతమొత్తాన్ని సాధారణ, కార్పొరేట్ ప్రయోజనాల కోసం వాడుతారు.