న్యూఢిల్లీ: తమ అనుబంధ సంస్థ యూజియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్‌కు చెందిన తెలంగాణలోని ఫార్ములేషన్స్ తయారీ యూనిట్‌కు అమెరికా హెల్త్ రెగ్యులేటర్ నుంచి హెచ్చరిక లేఖ అందిందని అరబిందో ఫార్మా లిమిటెడ్ శుక్రవారం తెలిపింది. యూజియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్ ఫార్ములేషన్ తయారీ సదుపాయం యూనిట్-–3 యూఎస్ఎఫ్డీఏ ద్వారా ‘అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్(ఓఏఐ) హోదాను పొందిందని కంపెనీ మే నెలలో పేర్కొంది.
ఓఏఐ తర్వాత, యూనిట్‌కు హెచ్చరిక లేఖ వచ్చిందని తెలిపింది. రెగ్యులేటర్ చేసిన హెచ్చరికల వివరాలను ఇది వెల్లడించలేదు. యూఎస్ మార్కెట్లకు ప్రస్తుతం ఉన్న సరఫరాలపై ఎటువంటి ప్రభావం లేదని కంపెనీ తెలిపింది. యూఎస్ఎఫ్డీఏ ఈ ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి రెండో తేదీ వరకు పటాన్‌చెరు మండలం పాశమైలారం మూడో యూనిట్లో తనిఖీని నిర్వహించింది.