
వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బాలిక అత్మహత్య చేసుకుంది. మృతురాలు కళాశాలలో వంటపని చేస్తున్న కిషన్, కవిత దంపతుల కుమార్తె నందినిగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకు తరలించారు. నందిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.