తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతోంది. వరంగల్‌లో కాంగ్రెస్ ఏకపక్షంగా దూసుకుపోతోంది. మెజారిటీ నియోజకవర్గాల్లో హస్తం పార్టీ సత్తా చాటుతోంది. ఇక తాజాగా అందుతోన్న సమాచారం మేరకు ( 12 గంటలకు ) ఏయే నియోజకవర్గాల్లో, ఎవరు ముందంజలో ఉన్నారు.? ఎంత మెజారిటీతో కొనసాగుతున్నారో తెలుసుకుందాం
వరంగల్ 12 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 10 స్థానాల్లో కాంగ్రెస్... 02 స్థానాల్లో BRS అభ్యర్థులు ఆధిక్యం
- వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి (7) 6158 ఓట్ల ఆధిక్యం..
- వరంగల్ తూర్పులో -(3) 6271 ఓట్ల తో కాంగ్రెస్ అభ్యర్థి సురేఖ
- భూపాలపల్లి లో ( 5) - 10,932 ఓట్ల ఆధిక్యంల్లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు
- పాలకుర్తి లో - 5వ రౌండ్ ముగిసే వరకు 5297 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి
- వర్దన్నపేటలో - 10వ రౌండ్ ముగిసే వరకు 4821 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి KR నాగరాజు
- ములుగు లో - (10 ) 14,716 ఓట్ల ఆధిక్యంతో సీతక్క..
- మహబూబాబాద్ (6) 13,728 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి మురళినాయక్ ముందంజ
- డోర్నకల్ - ( 5) 13,186 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రనాయక్
- స్టేషన్ ఘనపూర్ -(8) 6977 ఓట్ల ఆధిక్యంలో BRS అభ్యర్థి కడియం శ్రీహరి
- జనగామ -(6) 8640 ఓట్ల ఆధిక్యంలో BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి
- పరకాల - ( 4) 1401 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి
- నర్సంపేట -(10) 4231 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి