‘పుల్వామా దాడి జరిగిన రెండు, మూడు గంటల తర్వాత కూడా దాని గురించి ప్రధాని మోడీకి తెలియదా?’అనే ప్రశ్నకు సమాధానం కరువైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీయేమో పీఎంకి తెలిసినా తెలియనట్లే ఉన్నారంటోంది. తెలియదనే మాటే నిజమైతే దేశంలో ‘కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టం ’అంత వీకా అని నిలదీస్తోంది. అధికార బీజేపీ మాత్రం హస్తం పార్టీ అడుగుతున్నవాటిని వదిలేసి మిగతా అన్నింటికీ ప్రతివిమర్శలకు దిగుతోంది. ప్రధాని కానీ ఆయన ఆఫీసు కానీ రియాక్ట్ కాకపోవటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
క్లైమేట్ సహకరించకపోవటంతో ప్రధాని రుద్రాపూర్ కి వెళ్లలేదు. ఖినానౌలీ గెస్ట్ హౌజ్ నుంచే సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు ఫోన్ ద్వారా రుద్రాపూర్ పబ్లిక్ మీటింగ్ ని ఉద్దేశించి మాట్లాడారు. కానీ, తన స్పీచ్ లో పుల్వామా ఎటాక్ ని ప్రస్తావించలేదు. దాడి గురించి తెలిసుంటే జవాన్ల మృతికి సంతాపంగా సభలో మౌనం పాటించమని చెప్పేవారు. ఏదేమైనా షూటింగ్ కి, మీటింగ్ కి మధ్య దాదాపు నాలుగు గంటల పాటు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.
కాశ్మీర్ లో ని పుల్వామాలో టెర్రరిస్టులు 40 మందికి పైగా సీఆర్ పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకొని పది రోజులు దాటినా ఒక్క అంశం మాత్రం ఇవాళ్టికీ మిస్టరీగానే మిగిలింది. ఈ నెల 14న దాడి జరిగిన టైంలో (సాయంత్రం 3 గంటల 15 నిమిషాలప్పుడు)ప్రధాని మోడీ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. దాడి జరిగిన రెండు మూడు గంటల తర్వాత కూడా ఆయన స్పందించకపోవటం వివాదానికి కారణమైంది. ఆ రోజు ప్రధానికి, ఆయన ఆఫీసు(పీఎంఓ)కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందా అనే డౌటూ వస్తోంది. ఫిబ్రవరి 14 నాటి పీఎం షెడ్యూల్ కి సంబంధించిన కచ్చితమైన సమాచారం కావాలని మీడియా పీఎంఓని రాతపూర్వకంగా అడిగినా ఒక్క చిన్న విషయం కూడా వెల్లడించలేదు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపిన అంశాలు మినహా తమ వద్ద ఏమీ లేదని ప్రిన్సిపల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తేల్చేశారు. ఆ రోజు నిజంగా ఏ జరిగిందో చెప్పటానికి కేంద్ర మంత్రి గానీ, సర్కారు ఆఫీసర్లు గానీ, చివరికి రూలింగ్ పార్టీ ప్రతినిధులు గానీ ఇష్టపడట్లేదు. కనీసం నోరు మెదపట్లేదు. దాడి జరిగిన రోజు రెగ్యులర్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు, వీడియోలు గందరగోళం సృష్టించాయి. ఎటాక్ విషయం వెల్లడైన మూడు గంటల తర్వాత కూడా ప్రధాని మోడీ ఏమీ తెలియనట్లు కార్బెట్ నేషనల్ పార్క్‌లో ఒక ఛానల్ జరిపిన షార్ట్ ఫిల్మ్ షూటింగ్ లో పాల్గొన్నారన్న కాంగ్రెస్ పార్టీ వాదనను ఓ ఇంగ్లీష్ పేపర్ తోసిపుచ్చింది.‘గవర్నమెంట్’ సమాచారం ప్రకారం ఇది తప్పు అని ఖండించింది. కానీ, ప్రభుత్వం తరఫున ఆ వివరాలను ఎవరు చెప్పారో రాయలేదు. కాబట్టి ఆ న్యూస్ ని కూడా నమ్మటానికి లేదు. టూరిజం ప్రమోషన్, క్లైమేట్ ఛేంజ్ అవేర్ నెస్ పై షార్ట్ ఫిల్మ్ షూటింగ్ లో మోడీ పాల్గొంది నిజమే. తర్వాత రుద్రాపూర్ లో పబ్లిక్ మీటింగ్ కి వెళ్లారు.
టెర్రర్ ఎటాక్ న్యూస్ రావటం సాయంత్రం నాలుగు గంటలప్పుడు మొదలైంది. ఆ టైంలో ఆయన కార్బెట్ పార్క్ నుంచి రుద్రాపూర్ కి జర్నీ చేస్తున్నారు’ అని ఆ పత్రిక ‘ఫ్యాక్ట్ చెక్ ’ పేరిట రాసింది. కొన్ని టీవీ ఛానళ్లలో, లోకల్ న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలేమో మరోలా ఉన్నాయి. మోడీ కాన్వాయ్.. పార్క్ నుంచి సాయంత్రం 6.40–7.30 మధ్యలో వెళ్లిపోయిందని చెప్పాయి. అ ఫిషియల్ షెడ్యూల్ ప్రకారం ప్రధాని ఆ రోజు ఉదయం 9 గంటలకు పార్క్‌కు వచ్చి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లాలి. కానీ, ఉత్తరాఖండ్ వాతావరణం బాగా లేక పర్యటన ఆలస్యమైంది.. ఢిల్లీలో బయలుదేరిన మోడీ ఫ్లైట్ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో ల్యాండ్ అయినప్పుడు వర్షం వచ్చింది. దీంతో అక్కడి నుంచి నాలుగు గంటలు ఆలస్యం గా హెలికాప్టర్ లో కలాఘర్ టౌన్ కి వెళ్లారు. అక్కడ హెలీకాప్టర్ దిగిన వెంటనే తీసిన ఫొటోతో పాటు ఇంటర్వ్యూ వీడియో చూస్తే అప్పుడు టైం సరిగ్గా ఉదయం 11 గంటల 15 నిమిషాలు.
కలాఘర్ లోని రామ్ గంగా నదిలో పదకొండున్నర, పన్నెండు గంటల సమయంలో పడవ ఎక్కిన ప్రధాని కార్బెట్ నేషనల్ పార్క్‌లో ని ధికాలా ఫారెస్ట్ గెస్ట్‌హౌజ్ కి మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకొని ఉంటారు. అక్కడ ఆ ఛానల్ ప్రతినిధులు షూటింగ్ పూర్తి చేసి ఉండొచ్చు. అయితే, ఆ షూటింగ్.. పుల్వామా ఎటాక్ కన్నా చాలా ముందే పూర్తయిందా లేదా అనేది తెలియదు. షూటింగ్ అనంతరం మోడీ, ధికాలా గెస్ట్‌హౌజ్ కి దగ్గరలోని ఖినానౌలీ గెస్ట్‌హౌజ్ కి చేరుకున్నారు. అక్కడి నుంచి రుద్రాపూర్ కి 85 కిలోమీటర్ల దూరం. షూటింగ్ వివరాలను జిల్లా ఆఫీసర్లు గానీ, పార్క్ ప్రతినిధులు గానీ వెల్లడించట్లేదు. ఈ నేపథ్యంలో టెర్రర్ ఎటాక్ గురించి ప్రధానికి తెలిసిందో లేదో వెలుగులోకి రావటం దాదాపు అసాధ్యం.
అంతా ప్రధాని ఇష్టం..
టెర్రరిస్టు ల దా డికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ .. నేషనల్ సెక్యూరి టీ అడ్వైజర్ కి తెలిసిన వెంటనే దాన్ని ప్రధానికి షేర్ చేశారా? లేదా? అనేది వాళ్లం తట వాళ్లు చెబితే తప్ప మనం తెలుసుకో వటం కష్టం. ఒకవేళ ఆ వి షయం తెలిసినా వెం టనే ఏం నిర్ణయం తీసుకోవాలనేది మోడీ ఇష్టం. అప్పటికే ఫైనల్ అయిన షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్లాలన్నా, లేక వెం టనే వెనక్కి రావాలన్నా అంతా ప్రధాని చేతుల్లోనే ఉంటుంది.