వాషింగ్​మెషీన్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలు 

  • ఇద్దరికి తీవ్ర గాయాలు 
  • పేలుడు ధాటికి ఊడిపోయిన తలుపులు
  • పగిలిపోయిన కారు అద్దాలు 

కామారెడ్డి, వెలుగు: జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్​కాలనీలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో వాషింగ్​మెషీన్​పేలి భార్యభర్తలు తీవ్రంగా గాయపడ్డారు.​ 75 ఏండ్ల రాజూరి బాలయ్య, ఇతడి భార్య 69 ఏండ్ల బాలలక్ష్మి కొత్త బస్టాండ్​వెనకాల ఉన్న ​కాలనీలో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి హాల్​పక్కన ఉన్న వాషింగ్​మెషీన్​లో బట్టలు వేసి హాల్ లో నిలబడ్డారు. ఒక్కసారిగా వాషింగ్​మెషీన్​ పేలడంతో మంటలంటుకుని ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కామారెడ్డి గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించారు. పేలుడు తీవ్రతకు తలుపులు కూడా ధ్వంసమయ్యాయి. ఇంటి ముందు పార్క్​ చేసిన ఓ కారు అద్దాలు పగిలిపోయాయి. షార్ట్​సర్క్యూట్ తో కంప్రెషర్​పేలి ఉంటుందని అనుమానిస్తున్నారు.