సాధారణంగా విమాన ప్రయాణం అంటే ఖర్చులు భారీగా ఉంటాయి..మరీ అమెరికాలాంటి దూర దేశాలకు వెళ్లాలంటే టికెట్ ధరలు భారీగానే ఉంటాయి మనందరికి తెలుసు. అయితే ఇటీవల ఓ ప్రయాణికుడు వాషింగ్టన్ నుంచి ముంబైకి కేవలం 19 వేల రూపాయల టికెట్ ధరతో వచ్చాను.. ఇది నిజం..అనిX లో దానికి సంబంధించిన వివరాలు షేర్ చేశారు.. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ విషయంపై చర్చ పెట్టారు.. ఫుల్ గా కామెంట్లు చేస్తున్నారు.. నిజంగా అమెరికా లోని వాషింగ్టన్ నుంచి ముంబై కి ఇంత తక్కువ ఖర్చుతో ఎలా వచ్చాడు అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ డిటెయిల్స్ తెలుసుకుందాం రండి..
సాధారణంగా వాషింగ్టన్ నుంచి ముంబైకి టెకెట్ ధర 60 వేల రూపాయల నుంచి 90 వేలు మధ్య ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో @phalgun_g అనే X ఖాతా ఉన్న వ్యక్తి .. వాషింగ్టన్ నుంచి ముంబైకి ఫ్లైట్ టికెట్ ఆఫర్ ధరకు సంబంధించిన ఫొటోను షేర్ చేసింది. దీని ప్రకారం.. టికెట్ ధర కేవలం 19 వేల రూపాయలు మాత్రమే..
ఈ ఫొటోలో చాలా ట్రావెల్ కంపెనీలు ఇచ్చిన నమ్మశక్యం కానీ ఆఫర్లను చూపిస్తుంది. ఫ్లైట్ నెట్ వర్క్ అనే ట్రావెల్ కంపెనీ వాషింగ్టన్ నుంచి ముంబై రూట్ కోసం కేవలం రూ. 18,770 చెల్లిస్తే చాలు అని ఆఫర్ చేస్తోంది. గోటోగేట్ - రూ. 19,332, క్లియర్ ట్రిప్- రూ. 19,815 టికెట్ ధరలను ఆఫర్ చేశాయి. ఇంకాస్త కొంచెం ఎక్కువ ధర అంటే రూ. 20,151 కి గోల్బిబో ట్రావెలింగ కంపెనీ అందిస్తుందట. ఈ ప్రయాణం సౌదీ అరేబియాలో ని జెడ్డామీదుగా సాగుతుందట.
ఈ టికెట్ ను X లో షేర్ చేసిన అతను.. రూ. 19 వేల తో వాషింగ్టన్ నుంచి ముంబై ప్రయాణించడం సాధ్యమేనా అంటూ అదికూడా రెండు చెకింగ్ బ్యాగేజ్ లతో సహా అని రాశాడు.
ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఒకరు ఊకో.. ఇదంతా అబద్ధం.. ఇంత తక్కువ ఖర్చుతో అమెరికాలోని వాషింగ్టన్ ఎలా వస్తారు అని ఆశ్చర్యం.. అనుమానం వ్యక్తం చేశారు. కొంతమంది అయితే ఇదో రకం పిచ్చి..ఇది నమ్మశక్యం కానిది అని షేర్ చేశారు.. మరోవైపు వాషింగ్టన్ నుంచి ముంబైకి ఇంత తక్కువ ఖర్చు లో వచ్చేటట్టు అయితే చాలా బాగుండు అని కొందరు ఆశాభావం కూడా వ్యక్తం చేశారు.
ఏదీ ఏమైనా ఇది నిజమయితే బాగుండు కదా అంటున్నారు మరికొందరు నెటిజన్లు.