Washington Sundar: నాలుగేళ్ల తరువాత రీఎంట్రీ.. రాగానే సరికొత్త రికార్డు

Washington Sundar: నాలుగేళ్ల తరువాత రీఎంట్రీ.. రాగానే సరికొత్త రికార్డు

పూణే టెస్టులో భార‌త స్పిన్నర్లు చెల‌రేగారు. ప‌దికి ప‌ది వికెట్లు ప‌డ‌గొట్టి న్యూజిలాండ్‌‌ను కుప్పకూల్చారు. వెటరన్ స్పిన్నర్ ర‌విచంద్రన్ అశ్విన్(3 వికెట్లు) తికమక బంతులతో న్యూజిలాండ్ బ్యాట‌ర్లను ఇర‌కాటంలో పెడితే.. దాదాపు నాలుగేళ్ళ తరువాత జట్టులోకి వ‌చ్చిన వాషింగ్టన్ సుంద‌ర్ ఏడు వికెట్లతో కివీస్ న‌డ్డివిరిచాడు. దాంతో, ప‌ర్యాట‌క జట్టు 259 ప‌రుగుల‌కే పరిమితమైంది. ఈ ప్రదర్శనతో సుందర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) చరిత్రలో ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. 

ఐసీసీ 2019లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) టోర్నీని ప్రవేశపెట్టగా.. ఐదేళ్లు గడుస్తున్నా ఏడేసి వికెట్లు పడగొట్టిన బౌలర్ ఒక్కరూ లేరు. పూణే టెస్టులో 25 ఏళ్ల వాషింగ్టన్ సుంద‌ర్ ఆ ఘనత సాధించాడు. 

ALSO READ | IND vs NZ 2nd Test: ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియాదే పైచేయి

WTC చరిత్రలో బెస్ట్ బౌలింగ్ గణాంకాలు

  • వాషింగ్టన్ సుందర్: 7/59 (పూణే, 2024)
  • ప్రబాత్ జయసూర్య: 6/42 (గాలె, 2024)
  • ఎబాడోట్ హుస్సేన్: 6/46 (మౌంట్ మౌంగనుయ్, 2022)
  • నాథన్ లియోన్: 6/65 (వెల్లింగ్‌టన్‌,2024)
  • తైజుల్ ఇస్లాం: 6/76 (సిల్హెట్‌, 2023)