IND vs NZ 3rd Test: రచీన్‌కు ఎంత కష్టమొచ్చింది: మూడు సార్లు సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్

IND vs NZ 3rd Test: రచీన్‌కు ఎంత కష్టమొచ్చింది: మూడు సార్లు సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్

న్యూజీలాండ్ యంగ్ బ్యాటర్ రచీన్ రవీంద్రకు టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ విలన్ లా మారాడు. సూపర్ ఫామ్ లో ఉన్న అతన్ని ఈజీగా పెవిలియన్ కు చేరుస్తున్నాడు. కనీసం బాల్ టచ్ చేయకుండానే సుందర్ బౌలింగ్ లో రచీన్ రవీంద్ర ఔటవుతున్నాడు. ప్రస్తుతం ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులోనూ సుందర్ బౌలింగ్ లోనూ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు. 

అంతకముందు పూణే టెస్టులోనూ రచీన్ రవీంద్రను సుందర్ రెండు ఇన్నింగ్స్ ల్లో బౌల్డ్ చేశాడు. దీంతో వరుసగా మూడో సారి సుందర్ కు సరెండర్ అయ్యాడు. ఆఫ్ సైడ్ వేస్తున్న బంతిని అంచనా వేసేలోపు వికెట్లను వికెట్లను గిరాటేసేస్తుంది. తన సూపర్ ఫామ్ తో భారత్ కు రచీన్ రవీంద్ర అడ్డుగోడలా నిలిస్తే.. ఇప్పుడు సుందర్ మాత్రం అతనికి పీడకలలా మారాడు. రచీన్ తొలి టెస్టులో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక  పాత్ర పోషించాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనూ 65 పరుగులు చేసి రాణించాడు. 

Also Read :- సుందర్ మరోసారి మ్యాజిక్.. న్యూజిలాండ్‌పై తొలి సెషన్ మనదే

సూపర్ టచ్ లో ఉన్న రచీన్ ను సుందర్ వరుసగా రెండు సార్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యేలా చేశాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదటి రోజు లంచ్ సమయానికి న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజ్ లో విల్ యంగ్(38) డారిల్ మిచెల్ (11) ఉన్నారు. భారత బౌలర్లలో సుందర్ కు రెండు వికెట్లు దక్కాయి. ఆకాష్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు.