
టీమిండియాలో చోటు దక్కకపోయినా ఐపీఎల్ లో ఆడుతున్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. భారత జట్టుకు దూరమవుతున్నా ఏడాదికి ఒకసారి పలకరించే ఐపీఎల్ లో మన క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. అయితే టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ మాత్రం ఇందుకు భిన్నం. అతనికి ఐపీఎల్ అసలు కలిసి రావడం లేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా ఆల్ రౌండర్ల సరిగా అవకాశం రావట్లేదు. ఇందులో సుందర్ కూడా ఉన్నాడు.
ALSO READ | GT vs PBKS: ఆసీస్ స్టార్‌పై విమర్శలు: అయ్యర్ రూపంలో మ్యాక్ వెల్‌కు బ్యాడ్‌లక్
2024 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ తరపున సుందర్ చాలా తక్కువ మ్యాచ్ లు ఆడాడు. మంగళవారం (మార్చి 24) పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ సుందర్ గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లేయింగ్ 11 లో లేడు. అతని స్థానంలో రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ కు స్థానం దక్కింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండడంతో ఈ తమిళ నాడు ఆల్ రౌండర్ ను అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ లో జట్లు సరిగా ఉపయోగించలేకపోతున్నాయి. 2023 నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమలులోకి వచ్చింది. ఈ రూల్ వచ్చినప్పటి నుంచి సుందర్ 9 మ్యాచ్ లే ఆడగా.. 22 మ్యాచ్ లు బెంచ్ కు పరిమితమయ్యాడు.
ఐపీఎల్ 2022 నుంచి 2024 వరకు మూడు సీజన్ ల పాటు సుందర్ సన్ రైజర్స్ జట్టుకు ఆడాడు. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో సుందర్ ను రూ. 3.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. సుందర్ టీమిండియాలో మూడు ఫార్మాట్ లలో సభ్యుడు. 15 మంది స్క్వాడ్ లో ఎంపికైనప్పటికీ ఇండియా జట్టులో కూడా అతనికి ప్లేయింగ్ 11 లో చోటు దక్కడం లేదు. ఇటు ఐపీఎల్ లో కూడా అతనికి నిరాశే ఎదురవుతుంది. 2025 ఐపీఎల్ సీజన్ లో ఎన్ని మ్యాచ్ ల్లో ఆడే అవకాశం వస్తుందో చూడాలి.