స్వదేశంలో రారాజులా బ్రతుకుతోన్న టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో భంగపాటు ఎదురైంది. బెంగళూరు, పూణే, ముంబై అంటూ వేదికలు మారినా ఫలితం మాత్రం మారలేదు. ఆడిన మూడు టెస్టుల్లోనూ వరుసగా పరాజయం పాలైంది. ఫలితంగా 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయింది. 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ చేజార్చుకున్న టీమిండియా.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2023-25) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ఈ పరాజయంపై పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీం అక్రం భారత్ పై సెటైర్ వేశాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య సోమవారం (నవంబర్ 4) తొలి వన్డే జరిగింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ కు కామెంటేటర్లుగా వసీం అక్రం, మైకేల్ వాన్ వ్యవహరించారు. ఈ మ్యాచ్ జరుగుతుండగా మైకేల్ వాన్ తనకు భారత్, పాకిస్థాన్ కు మధ్య టెస్ట్ సిరీస్ చూడాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టాడు. దీనికి అక్రం స్పందిస్తూ స్పిన్ ట్రాక్ పై భారత జట్టును పాకిస్థాన్ ఓడించగలదని అక్రం అన్నాడు". భారత జట్టు ఇటీవలే స్పిన్ పిచ్ లపై ఆడేందుకు ఇబ్బంది పడుతుంది. మరోవైపు స్వదేశంలో పాకిస్థాన్ తమ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ ను చివరి టెస్టుల్లో ఓడించి సిరీస్ గెలుచుకుంది.
ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతుంది. ఈ సిరీస్ అటు భారత్ కు.. ఇటు ఆస్ట్రేలియాకు అత్యంత కీలకంగా మారింది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముందు ఇరు జట్లు ఆడుతున్న చివరి సిరీస్ ఇదే కావడంతో.. ఫైనల్ కు అర్హత సాధించాలంటే సిరీస్ విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా తన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. స్పిన్ పిచ్ లపై ఇబ్బంది పడ్డ భారత జట్టు బౌన్సీ పిచ్ లపై ఎలా ఆడుతుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
'𝐏𝐚𝐤𝐢𝐬𝐭𝐚𝐧 𝐜𝐚𝐧 𝐛𝐞𝐚𝐭 𝐈𝐧𝐝𝐢𝐚 𝐢𝐧 𝐓𝐞𝐬𝐭𝐬 𝐨𝐧 𝐬𝐩𝐢𝐧𝐧𝐢𝐧𝐠 𝐭𝐫𝐚𝐜𝐤𝐬'
— CricTracker (@Cricketracker) November 4, 2024
Wasim Akram after India's historic home series loss to New Zealand
Read more👉 https://t.co/ZjitKc8V3W pic.twitter.com/1F6iICKn5T