IPL 2024: ట్రోలింగ్ చేసినవారే ప్రశంసిస్తారు.. హార్దిక్ పాండ్యకు వసీం జాఫర్ మద్దతు

IPL 2024: ట్రోలింగ్ చేసినవారే ప్రశంసిస్తారు.. హార్దిక్ పాండ్యకు వసీం జాఫర్ మద్దతు

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక పాండ్యపై ట్రోలింగ్ కొనసాగుతుంది. ఈ స్టార్ ఆల్ రౌండర్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గెలుపోటములను పక్కన పెడితే పాండ్య వైఖరి ఎవరికీ నచ్చడం లేదు. రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన హార్దిక్ తొలి మ్యాచ్ నుంచే ట్రోలింగ్ కు గురవుతున్నాడు. దీనికి తగ్గట్లు పాండ్య తన ప్రవర్తన మారదన్నట్టు ఎవరినీ లెక్క చేయడం లేదు. ఓ వైపు కెప్టెన్ గా.. మరోవైపు బ్యాటర్ గా దారుణంగా విఫలమవుతున్నాడు. తాజాగా నిన్న (ఏప్రిల్ 30) లక్నో మ్యాచ్ తో డకౌట్ అవ్వడంతో పాండ్యపై విమర్శల వర్షం కురుస్తుంది. 

టీమిండియా వైస్ కెప్టెన్ తొలి బంతికే డకౌట్ అయ్యాడని.. అతని కంటే రింకూ సింగ్ చాలా బెటర్ ప్లేయర్ అని కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ సైతం హార్దిక్ కు బుర్ర లేదని అతనిపై మండిపడ్డాడు. అయితే టీమిండియా మాజీ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్  వసీం జాఫర్ మాత్రం హార్దిక్ పాండ్యకు మద్దతుగా నిలిచాడు. "పాండ్యపై కెప్టెన్సీపై వస్తున్న ట్రోలింగ్ చూసి చాలా నిరాశకు గురయ్యాను. అతను రానున్న వరల్డ్ కప్ లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడతాడు. అప్పుడు విమర్శించిన వ్యక్తులే ప్రశంసిస్తారు". అని జాఫర్ అన్నాడు. 

నిన్న లక్నోపై అసలే ఓటమి.. ఆపై ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు. ఈ బాధలో పాండ్యకు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. ఈ టోర్నీలో  రెండోసారి స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు పాండ్యకు రూ. 24 లక్షల జరిమానా విధించబడింది. ఈ మ్యాచ్ లో పాండ్య బ్యాటింగ్ లో తొలి బంతికే డకౌటయ్యాడు. బ్యాటింగ్ లో విఫలమైనా బౌలింగ్ లో రాణించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 26 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.