నలుగురు ఓపెనర్లు ఎందుకు..దేశవాలీ కంటే..ఐపీఎలే ప్రామాణికమా..?

వెస్టిండీస్ టూర్ కోసం టెస్టు, వన్డే జట్ల ఎంపికపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లను కాకుండా ఐపీఎల్లో రాణించిన కుర్రాళ్లనే  బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేయడంపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. టీమిండియా సెలక్షన్పై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ విమర్శలు గుప్పించారు. 

నలుగురు ఎందుకు..?

వెస్టిండీస్ టూర్లో భాగంగా రెండు టెస్టులకు బీసీసీఐ సెలక్టర్లు నలుగురు ఓపెనర్లను ఎంపిక చేయడాన్ని వసీం జాఫర్ తప్పుపట్టాడు. వెస్టిండీస్ టూర్ కోసం టెస్టులకు నలుగురు ఓపెనర్లతో ఏం అవసరం అని ప్రశ్నించాడు. వారికి బదులుగా మిడిల్ ఆర్డర్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ని ఎంపిక చేసి ఉంటే బాగుండేదన్నాడు. సర్ఫరాజ్ ఖాన్  దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడని చెప్పాడు. అతన్ని ఎంపిక చేసి ఉంటే..నిలకడైన ప్రదర్శనకు గుర్తింపు దక్కినట్టు ఉండేదన్నాడు వసీం జాఫర్.

నెం.3లో ఎవరు ఆడతారు..?

వెస్టిండీస్తో టెస్టులకు పుజారాను ఎంపిక చేయని సెలక్టర్లు..నెంబర్ 3లో ఎవరు ఆడతారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. “నలుగురు ఓపెనర్ల అవసరం ఏమిటి? అని నిలదీశాడు. రోహిత్, శుభ్‌మన్ గిల్, గైక్వాడ్, జైస్వాల్ కు  బదులుగా..మిడిలార్డర్ కోసం  సర్ఫరాజ్‌ ఖాన్ను ఎంపిక చేస్తే బాగుండేదని  జాఫర్ ట్విట్టర్లో అభిప్రాయపడ్డాడు.

Also Read : కార్యకర్తల వల్లే బీజేపీ బలంగా ఉంది..తెలంగాణలో అధికారంలోకి వస్తం

ఐపీఎల్లో ఆడితే సరిపోతుందా..?

దేశవాలీ క్రికెట్లో అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్ అద్భుతంగా ఆడుతున్నారని వసీం జాఫర్ కొనియాడాడు. వీరిద్దరు రంజీల్లో, ఇండియాA తరపున నిలకడైన ప్రదర్శన చేస్తున్నారని చెప్పారు. ఎప్పటి నుంచో టీమిండియాకు ఆడాలని వెయిట్ చేస్తున్నారని..వారిని కాదని..ఐపీఎల్లో రాణించిన వారిని సెలక్ట్ చేయడం ఏంటని ప్రశ్నించాడు. దేశవాలీల్లో రాణించిన వారిని పక్కన పెట్టి..ఐపీఎల్లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్, జైస్వాల్ను ఎలా ఎంపిక చేస్తారన్నాడు. టీమిండియాకు ఆడాలంటే ఐపీఎల్లో ఆడితే సరిపోతుందా..దేశవాలీ క్రికెట్ ప్రదర్శన అవసరం లేదా అని నిలదీశాడు. 

షమీకి ఎందుకు రెస్ట్...

వెస్టిండీస్ టూర్ కోసం మహ్మద్ షమీకి ఎందుకు రెస్ట్ ఇచ్చారని వసీం జాఫర్ బీసీసీఐ సెలక్టర్లను ప్రశ్నించాడు. దాదాపు నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మహ్మద్ షమీకి రెస్ట్ ఎందుకు ఇచ్చారన్నాడు. షమీ ఎంత ఎక్కువ బౌలింగ్ చేస్తే అంత మెరుగవుతాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

త్వరలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ  టూర్ లో  భాగంగా విండీస్ తో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ పర్యటన కోసం బీసీసీఐ టెస్టు, వన్డే జట్లను ఎంపిక చేసింది. 

టెస్టు టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, నవదీప్ సైనీ.

వన్డే టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కట్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేశ్ కుమార్.