మట్టి పాలవుతున్న పేదల బియ్యం

మట్టి పాలవుతున్న పేదల బియ్యం

ఫొటోలో కనిపిస్తున్నవి ఇసుక బస్తాలు అనుకుంటున్నారా ! కాదు.. కాదు.. పేదల కడుపు నింపాల్సిన రేషన్‌‌ బియ్యం. ఖమ్మం జిల్లా ఆఫీసర్ల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా ఇలా మట్టిలో కలిసిపోతున్నాయి. అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌‌ బియ్యాన్ని పట్టుకుంటున్న ఆఫీసర్లు, సరైన పద్ధతిలో నిల్వ చేయకుండా నిర్లక్ష్యం చూపుతున్నారు. ఖమ్మం అర్బన్‌‌ మండలంలో 2021 నుంచి ఇప్పటివరకు సుమారు 4 వేల బస్తాల బియ్యాన్ని సివిల్‌‌ సప్లై ఆఫీసర్లు పట్టుకున్నారు. 

ఆ బియ్యాన్ని వేలం వేసి డబ్బులను ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. కానీ ఆఫీసర్లు అదేమీ పట్టించుకోవడం లేదు. అటు వేలం వేయకుండా, ఇటు పేదలకు పంచకుండా వదిలేయడంతో వేలాది బస్తాల బియ్యం ఇలా మట్టి పాలవుతున్నాయి.