బీర్ బాటిల్లో చెత్త.. వైన్స్ నిర్వాహకులతో గొడవ

పోతంగల్,వెలుగు : పోతంగల్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర వైన్స్లో బీరుకొన్న ఓ వ్యక్తి.. ఇంటికి తీసుకెళ్లి తాగేందుకు ఓపెన్ చేసి చూడగా అందులో చెత్త ఉండడాన్ని చూసి షాక్ అయ్యాడు. అప్పటికే ఆలస్యం అవటంతో తర్వాత రోజు బీర్ బాటిల్ తీసుకుని వైన్ షాపుకు వచ్చి నిర్వాహకులను ప్రశ్నించాడు. నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని మండిపడ్డాడు.

అతనితో మాట్లాడిన నిర్వాహకులు బాటిల్ ఓపెన్ చేయకముందే చెప్తే ఏదైనా చేయొచ్చని, ఒకరోజు ఆగి తెస్తే ఆయన చెప్పేది నిజమేనని ఎలా నమ్మాలి అన్నారు. అయితే బీరు బాటిల్లో చెత్త రావటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈ విషయమై ఎక్సైస్ అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నట్లు సమాచారం.