ఇక ఇళ్లల్లో రప్ప.. రప్ప.. పుష్ప-2 ఓటీటీ డేట్ చెప్పేసిన నెట్ఫ్లిక్స్.. ట్విస్ట్ ఏంటంటే..

ఇక ఇళ్లల్లో రప్ప.. రప్ప.. పుష్ప-2 ఓటీటీ డేట్ చెప్పేసిన నెట్ఫ్లిక్స్.. ట్విస్ట్ ఏంటంటే..

కలెక్షన్ల సునామీతో బాక్సాఫీస్ను షేక్ చేసిన  పుష్ప-2 సినిమా ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో వచ్చేస్తోంది. ఇన్నాళ్లూ వెండితెరపై సందడి చేసిన పుష్ప-2 ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ వేదికగా జనవరి 30న బుల్లితెరను దున్నేయడానికి వచ్చేస్తోంది. అంటే.. మరికొన్ని గంటల్లోనే ఓటీటీ సినిమాల రికార్డులను పుష్పరాజ్ బద్ధలుకొట్టబోతున్నాడు.

అయితే ట్విస్ట్ ఏంటంటే ఎక్స్ ట్రా ఫుటేజ్ అదేనండీ రీలోడెడ్ వెర్షన్ కూడా ఓటీటీలో యాడ్ చేశారు. దీంతో.. పుష్ప-2 రన్ టైం 23 నిమిషాలు పెరిగింది. రీలోడెడ్ వెర్షన్ కూడా యాడ్ చేయడంతో ఓటీటీలో పుష్ప-2 సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాల నుంచి 3 గంటల 44 నిమిషాలకు పెరిగింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో పుష్ప-2 ఓటీటీలోకి విడుదలవుతుండటం విశేషం.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. పుష్ప-2 సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తంలో చెల్లించి సొంతం చేసుకుంది. సుమారు రూ.275 కోట్లకు పైనే చెల్లించి పుష్ప-2 సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందని టాక్. డిసెంబర్ 4, 2024న రాత్రి 9.30 గంటల ఆటతో పుష్ప-2 థియేటర్లలో సందడి చేసింది. 

ALSO READ | Pushpa 2 OTT: రికార్డు స్థాయిలో పుష్ప 2 OTT హక్కులు.. నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లు చెల్లించిందంటే?

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో, స్క్రీన్లలో విడుదలైన సినిమాగా చరిత్ర సృష్టించింది. థియేట్రికల్ రన్లో రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పుష్ప-2 బాక్సాఫీస్ రికార్డులను రప్ప..రప్ప చేసి పడేసింది. భారతీయ సినీ చరిత్రలోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి తెలుగు సినిమా స్థాయి ‘తగ్గేదే లే’ అని అల్లు అర్జున్, సుకుమార్ మరోసారి రుజువు చేశారు.