పళ్లతో కారును లాగేసిన పులి

పళ్లతో కారును లాగేసిన పులి

‘పులితో ఫోటో దిగాలనుకోవడం కాస్త రిస్కే.. అయినా పర్లేదు.. కానీ చనువిచ్చింది కదా అని ఆటాడేస్తా అంటే వేటాడేస్తది’ ఈ డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోది. ఈ డైలాగ్ లో చెప్పినట్లు పులితో అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. దాని పంటి గాటైన, పంజా వేటైనా ఒక్కసారి పడిందో కష్టమే. పులి వేటలో అంత పవరుంటుంది. తాజాగా పులి గాటుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో కర్నాటకలోని బన్నెరఘట్ట నేషనల్ పార్క్ లో వెలుగుచూసింది. పులి తన పంటితో ఏకంగా టూరిస్ట్ కారును లాగడం రికార్డయింది. ఈ ఘటనను మరో కారులో ఉన్న పర్యాటకులు వీడియో తీశారు. టూరిస్టులు ఉన్న మహీంద్రా గ్జైలో కారును పులి పదేపదే కొరుకుతూ ఉన్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఒకానొక సమయంలో పులి కారు బంపర్‌పై పట్టు సాధించి కారును వెనక్కి లాగింది. 

ఈ క్లిప్‌ను షేర్ చేస్తూ.. గ్జైలో కారును లాగడంలో ఆశ్చర్యం లేదని అనుకుంటున్నాను. బహుశా మహీంద్రా కార్లు చాలా డెలీషియస్ ఉంటాయని నా అభిప్రాయం’ అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసినప్పటి నుంచి ఈ వీడియో 4 లక్షలకు పైగా వీక్షణలను పొందింది. పులి బలాన్ని చూసి చాలామంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

పులులు పిల్లి కుటుంబానికి చెందినవి. వీటికి సింహం పంజా కంటే రెండు రెట్ల ఎక్కువ శక్తి ఉంటుంది.  పులులు ఒక చదరపు అంగుళం మీద వెయ్యి పౌండ్ల కంటే ఎక్కువ ఒత్తిడిని కలిగించగలవు.

For More News..

డిసెంబర్ 31 సేల్స్.. తెలంగాణ చరిత్రలోనే రికార్డ్

విమానం గాల్లో ఉండగా కరోనా పాజిటివ్