మాంసాహార ప్రియులకు (Non Veg food) చికెన్ తో రకరకాల వంటకాలు తయారు చేసుకుంటారు. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు.. అయితే పెగ్గేసే వారి పక్కన దాదాపు ఏదో రకమైన చికెన్ తయారు చేసిన వంటకం ఉండాల్సిందే. చికెన్ కర్రీ, చికెన్ ప్రై (Chicken Fry), చికెన్ బిర్యానీ (Chicken Boryani), చికెన్ కబాబ్స్ ఇలా రకరకాల వంటకాలు తయారు చేసుకుంటారు. అయితే ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా చికెన్ కర్రీ రుచికరం గానే ఉంటుంది. అయితే ఇప్పడు తాజాగా చికెన్ తో కొత్త రకం వంటకం వీడియో సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. మరి ఈ వీడియోలో ఏముందో మీరూ ఓ లుక్కేయండి... .
గోవాకు చెందిన ఓ ఫుడ్ బ్లాగర్ మ్యారినేట్ చికెన్ ముక్కలతో తయారు చేసిన వంటకం నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది. మూకుడులో చికెన్ ముక్కలను వేయిస్తూ వాటిపై రమ్ ( ఆల్కహాల్) కలిపి లేత సెగపై వేయించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.
nirajgaonkar ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలో జులై నెలలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ రెసిపీ రీల్ నెటిజన్లను ఆకర్షించడంలో వైరల్ అయింది. కొంతమంది విచిత్రమైన ఆహార తయారీని లూప్‌లో చూడాలని కామెంట్ చేశారు. ఇప్పటి వరకు ( వార్త రాసే సమయానికి) ఈ క్లిప్ ఆరు లక్షల మందికి పైగా లైక్ చేశారు.
కొంతమంది నెటిజన్లు విచిత్రంగా స్పందించారు. ఇలాంటి వంటకం ఉందని ఊహకు కూడా రాదని కామెంట్ చేశారు. ఇలాంటి వినూత్నమైన చికెన్ రెసిపీకి సోషల్ మీడియాలో రేటింగ్ విషయంలో డిస్ లైక్ చేశారు. ఇంకొంతమంది ఓల్డ్ మాంక్ చికెన్ రెస్టారెంట్ లో చాలా కమ్మగా ఉందని కామెంట్ చేవారు. కొందరు రమ్మీ చికెన్ అని ఫన్నీగా పోస్ట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం రమ్మీ చికెన్ తయారీ వీడియో మీరు ఓ లుక్కేండి. . .