క్యారెట్లు తిన్నారని విద్యార్థినులను తిట్టి.. కొట్టిన వాచ్ ఉమెన్

క్యారెట్లు తిన్నారని విద్యార్థినులను తిట్టి.. కొట్టిన వాచ్ ఉమెన్

 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: క్యారెట్లు తిన్నరని స్టూడెంట్స్‎ను వాచ్ ఉమెన్ తిట్టి.. కొట్టిన ఘటన  భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టౌన్‎లోని సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్‎లో జరిగింది. దీంతో ఆదివారం ఇంటెలిజెన్స్​అధికారులు ఘటనపై వివరాలు సేకరించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం నైట్​డ్యూటీలో భాగంగా లేడీ వాచ్​ఉమెన్ బయట నుంచి ఆటోలో హాస్టల్‎కు వచ్చారు. ఆమె తన చేతిలోని క్యారెట్, ఇతర వస్తువుల సంచిని స్టూడెంట్స్‎కు ఇచ్చి రూమ్‎లో పెట్టమని చెప్పారు. అనంతరం స్టూడెంట్స్ రూమ్‎లో పెట్టి వెళ్లిపోయారు. 

కొంత సేపటికి వాచ్​ఉమెన్​వచ్చి క్యారెట్లను ఎందుకు తిన్నారని స్టూడెంట్స్‎ను ప్రశ్నించారు. తాము తినలేదని, రూమ్‎లో పెట్టి వచ్చామని చెప్పినా వినకుండా బండ బూతులు తిట్టడంతో పాటు కొట్టడడంతో బాధిత స్టూడెంట్స్​తమ పేరెంట్స్‎కు సమాచారం అందించారు. కొందరు పేరెంట్స్ అదే రోజు రాత్రి వెళ్లి ఆందోళన చేయగా హాస్టల్​వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సర్ది చెప్పడంతో విరమించారు. కాగా.. హాస్టల్‎లో వార్డెన్ సరిగా అందుబాటులో ఉండరని, మరో హాస్టల్‎కు కూడా ఇచ్ చార్జిగా ఉండడంతో తక్కువ టైమ్ హాస్టల్‎లో స్పెండ్​ చేస్తున్నట్టు స్టూడెంట్స్, వర్కర్స్​పేర్కొంటున్నారు. 

వార్డెన్ ​పర్యవేక్షణ సరిగా లేకపోవడంతోనే స్టూడెంట్స్​ఇష్టానుసారంగా బయటకు వెళ్లి వస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. మెనూ సక్రమంగా పాటించరని స్టూడెంట్స్​తెలిపారు. స్టూడెంట్స్‎ను వాచ్​ఉమెన్​కొట్టడంపై జిల్లా షెడ్యూల్​కులాల అభివృద్ది శాఖాధికారి అనసూర్య వివరణ కోరగా.. స్టూడెంట్స్‎ను ఎవరైనా కొడతారా..? ఎదురు ప్రశ్నించారు. వాచ్ ఉమెన్ కొట్టారని విద్యార్థులు చెప్తున్నారని అడిగితే.. అలాంటిదేమీ లేదని విచారించి కలెక్టర్‎కు నివేదిక ఇస్తానని  చెప్పారు.