నేటి తరం పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. మొబైల్ గేమ్స్, సోషల్‌మీడియాలో మునిగి తేలుతున్నారు. శారీరక శ్రమ అస్సలు ఉండటం లేదు. ఇది వారు పెద్దయ్యాక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువ సేపు టీవీ చూడటం వల్ల ఆనందాలే కాకుండా, అనారోగ్య సమస్య లు కూడా ఉన్నాయి. పిల్లల బెడ్రూంలో టీవీ ఉంటే, ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. బెడ్రూంలో టీవీ ఉంటే.. పిల్లలు టీవీ చూసే సమయం తెలియకుండానే పెరుగుతుంది.
గంటల గంటలు టీవీ చూడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఊబకాయంతో బాధపడే ప్రమాదం ఉంది. ఇది ఎవరో చెబుతున్నది. కాదు. 'యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్' పరిశోధకులు ఒక స్టడీ చేసి మరి చెప్తున్నారు. ఏడేళ్ల వయసులో తమకంటూ ఓ గది, అందులో టీవీ ఉన్న పిల్లలు పదకొండేళ్లు వచ్చేసరికి బరువు సమస్యతో బాధపడు తున్నారని రీసెర్చర్స్ చెప్తున్నారు.. మిగతా పిల్లలతో పోలిస్తే వీరు అధిక బరువుతో బాధపడతారని అంటున్నారు.
పిల్లల బెడ్రూంలో టీవీ అమర్చడం వల్ల చిన్నారులు ఊబకాయులుగా మారే ముప్పు 20 శాతం పెరుగుతుందట. అందుకే పిల్లల గదిలో టీవీ పెట్టాలనే ఆలోచన ఉంటే వెంటనే మార్చు కోవాలి. ప్రతిరోజు పిల్లలకు కొంత సమయం కేటాయించి, ఆటైమ్ లో టీవీ చూసేలా జాగ్రత్తలు తీసుకోవా లి. అప్పుడే టీవీకి దూరమవుతారు. ఆడుకోవడానికి కూడా కొంత సమయం ఇవ్వాలి. దాంతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు