పిల్లలు టీవీ చూడటం సాధారణ విషయమే. కానీ అదేపనిగా టీవీ చూస్తున్నారా... పిల్లల బెడ్రూంలో టీవీ ఉందా? అయితే పేరెంట్స్ ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే.. పిల్లల బెడ్రూంలో టీవీ ఉంచడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు పోర్చుగీస్ సైంటిస్టులు. నాలుగు నుంచి ఆరేళ్ల వయసున్న 120 మంది పిల్లలపై సర్వే చేసి మరీ ఈ విషయం చెప్పారు.
బెడ్రూంలో టీవీ ఉండటంతో ఎక్కువసేపు చూసి బరువు పెరగడానికి దారి తీస్తుందట. అంతేకాదు. భవిష్యత్తులో ఊబకాయ సమస్యతో కూడా బాధపడతారు. తరచుగా టీవీ చూడడం వల్ల శారీరకంగా ప్రభావం పడుతుంది.
ALSO READ | Good Health: వాసన పీలిస్తే చాలు: బరువు తగ్గటానికి సూపర్ టెక్నీక్ ఇది..
దానివల్ల పిల్లలు బయట ఆటలకు దూరమవుతుంటారు. దాంతోపాటు మెదడు చురుగ్గా పనిచేయదు. మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడతారంటున్నారు సైంటిస్టులు. పిల్లలు ఈ సమస్య నుంచి బయటపడేందుకు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.