
మియాపూర్, వెలుగు: కరెంట్‌షాక్‌తో వాచ్ మన్ మృతి చెందాడు. మియాపూర్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన ఉపేంద్ర(32) భార్య, ఇద్దరు పిల్లలతో మియాపూర్ మాధవ్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటూ వాచ్‌మన్‌గా చేస్తున్నాడు. బుధవారం ఉదయం అపార్ట్మెంట్లో నీటి కోసం మోటార్ఆన్చేయగా కరెంట్ షాక్కొట్టింది. కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని మియాపూర్ పోలీసులు తెలిపారు.