నిద్రిస్తున్న వాచ్ మెన్పైకి దూసుకెళ్లిన రెడిమిక్స్ వెహికల్..స్పాట్లోనే మృతి

నిద్రిస్తున్న వాచ్ మెన్పైకి దూసుకెళ్లిన రెడిమిక్స్ వెహికల్..స్పాట్లోనే మృతి
  • మృతుడు బిహార్  వాకు చెందిన హరిరామ్ సింగ్
  • కొంపల్లి మై స్పేస్ ఆరా కన్​స్ట్రక్షన్ వద్ద ఘటన

జీడిమెట్ల, వెలుగు: నిద్రపోయిన వాచ్ మెన్ పైకి రెడిమిక్స్ వెహికల్ ఎక్కడంతో మృతిచెందాడు.  పేట్​బషీరాబాద్​ పోలీసులు తెలిపిన ప్రకారం.. బిహార్​కి చెందిన హరిరామ్​సింగ్​యాదవ్​(40) బతుకు దెరువుకు ఐదు రోజుల కిందట సిటీకి వచ్చి కొంపల్లిలోని  మై స్పేస్ ఆరా కన్​స్ట్రక్షన్​లో వాచ్​మెన్​గా చేరాడు. మంగళవారం రాత్రి నిర్మాణం వద్దకు రెడిమిక్స్ కాంక్రీట్​వెహికల్ వచ్చి ఆగింది. దాని వెనకాల​హరిరామ్​సింగ్​నిద్రపోయాడు. డ్రైవర్​ చూసుకోకుండా వెహికల్ ను వెనక్కి తీయడంతో  టైర్లు ఎక్కడంతో అతడు మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.