పెట్రోల్, డీజిల్​కి ​బదులు నీళ్లు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల హైటెక్​సిటీ కాలనీలోని హెచ్​పీ పెట్రోల్​బంక్​లో నీళ్లు రావడం గొడవకు దారితీసింది. శనివారం సాయంత్రం పలువురు కార్లు, బైకుల్లో పెట్రోల్, డీజిల్​కొట్టించారు. అయితే, వెహికల్స్​ కొంత దూరం వెళ్లగానే ఆఫ్​ కావడంతో అనుమానించిన కస్టమర్లు బంక్​కు వచ్చి బాటిళ్లలో పెట్రోల్, డీజిల్​ కొట్టిస్తే నీళ్లు వచ్చాయి. 

దీంతో ఆగ్రహం చెందిన వారు బంక్​సిబ్బందిపై దాడి చేశారు. భారీ వర్షాలు పడ్డప్పుడు ట్యాంకుల్లోకి నీరు చేరి అప్పుడప్పుడు ఇలా జరుగుతుందని, అది తాము గమనించలేదని బంక్​ఇన్ చార్జి రాజేందర్​ తెలిపారు. సమస్యలు తలెత్తిన వాహనదారులు తమను సంప్రదిస్తే మళ్లీ ఇంధనం నింపుతామని పేర్కొన్నారు.