హైదరాబాద్ లో 30 గంటలుగా నో వాటర్..మంచినీళ్లు లేక జనం తీవ్ర ఇబ్బంది.. NHAIపై జలమండలి ఆగ్రహం

హైదరాబాద్ లో 30 గంటలుగా నో వాటర్..మంచినీళ్లు లేక జనం తీవ్ర ఇబ్బంది.. NHAIపై జలమండలి ఆగ్రహం

హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ జంక్షన్ దగ్గర పీఎస్సీ పైప్ లైన్ రిపేర్ కారణంగా శనివారం ( మార్చి 8 ) పలు ప్రాంతాల్లో వాటర్ సప్లై నిలిపివేసిన సంగతి తెలిసిందే. NHAI అధికారులు 12గంటల్లో పనులు పూర్తీ చేస్తామని చెప్పడంతో శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాటర్ సప్లై నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది జలమండలి.అయితే.. 30 గంటలు అవుతున్నా కూడా పైప్ లైన్ పనులు పూర్తి కాకపోవడంతో వాటర్ సప్లై మొదలవ్వలేదు. దీంతో NHAI తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది జలమండలి. 12 గంటలు అని చెప్పి 30 గంటలైనా పనులు పూర్తి చేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది జలమండలి.

30 గంటలుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, కేపీహెచ్బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, దీప్తి శ్రీ నగర్, బీరంగూడ, అమీన్ పూర్, నిజాంపేట్ ప్రాంతాల్లోని జనం మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

వీకెండ్ కావడంతో ఫ్యామిలీతో బయటకు వెళదామని ప్లాన్ చేసుకున్నోళ్ళు వాటర్ సప్లై లేకపోవడంతో బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. NHAI అధికారుల నిర్లక్ష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం.