హైదరాబాద్ లో నీటి ఎద్దడికి చెక్ పెట్టేలా వాటర్ బోర్డు ప్లానింగ్

హైదరాబాద్ లో నీటి ఎద్దడికి చెక్ పెట్టేలా వాటర్ బోర్డు ప్లానింగ్
  •     50 ఎంజీడీలు అదనంగా సరఫరా చేసేందుకు సన్నాహాలు
  •     నీటి కొరత, లోప్రెజర్ ఫిర్యాదులపై ఫోకస్​
  •     డిమాండ్​ను బట్టి అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు
  •     అవసరమైతే అదనంగా అద్దె ట్యాంకర్లు పెంపు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు వాటర్​బోర్డు రెడీ అవుతోంది. అన్ని ఏరియాలో నీటి సరఫరాపై ఫోకస్​పెట్టింది. నీటి కొరత, లోప్రెషర్ సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటోంది. సిటీతోపాటు ఓఆర్ఆర్​పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలకు వాటర్​బోర్డు రోజూ నీటిని సరఫరా చేస్తోంది. వేసవిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని, ముందస్తు ప్లాన్​సిద్ధం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో వాటర్​బోర్డు ఉన్నతాధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. బోర్డు మేనేజింగ్​డైరెక్టర్​సుదర్శన్​రెడ్డి తరచూ ఉన్నతాధికారులతో సమావేశమవుతూ సిటీలోని నీటి సరఫరాపై సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం బోర్డు పరిధిలో రోజుకు 450 నుంచి 500 ఎంజీడీల నీరు సరఫరా చేస్తుండగా, ఈసారి మరో 50 ఎంజీడీలను అదనంగా సరఫరా చేసేందుకు ప్లాన్​చేస్తున్నారు.

రెండు షిఫ్టుల్లో డ్యూటీ

రాబోయే 5 నెలలు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని సీఎం రేవంత్​ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో అవసరాన్ని బట్టి అదనపు సరఫరాకు ఎమర్జెన్సీ పంపింగ్ ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. తక్కువ నీరు ఉన్న ప్రాంతాలకు ఇతర రిజర్వాయర్ల నుంచి సర్దుబాటు చేసేలా ప్లాన్​చేస్తున్నారు. జంట నగరాలతోపాటు శివారు ప్రాంతాల్లో నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తినా, అవసరం మేరకు రిజర్వాయర్లలో నీరు లేకపోయినా వెంటనే ఫిల్లింగ్​స్టేషన్ల నుంచి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటి సరఫరా చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. 

ప్రస్తుతం గ్రేటర్​పరిధిలో 72 ఫిల్లింగ్​స్టేషన్లు ఉన్నాయి. డిమాండును బట్టి మరికొన్ని ఫిల్లింగ్​స్టేషన్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. బోర్డు పరిధిలో 500 వరకు ఉన్న ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. డిమాండ్​ను బట్టి మరికొన్ని ట్యాంకర్లను అద్దెకు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. చాలా ఏరియాల్లో డిమాండ్​కారణంగా ట్యాంకర్లు బుక్​చేసిన రెండు, మూడు రోజులకు కూడా రావడం లేదు. 

ఈ విషయమై వస్తున్న ఫిర్యాదులపై అధికారులు ఫోకస్​పెట్టారు. రెండు షిఫ్టుల్లో ట్యాంకర్లు అందించాలని నిర్ణయించారు. లీకేజీలు, కలుషిత నీటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించేలా ప్లాన్​చేశారు. నీటి కొరత, లోప్రెజర్ సమస్యలపై వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎండీ సుదర్శన్​రెడ్డి ఆదేశించారు. అందుకోసం స్పెషల్​టీమ్స్​ఏర్పాటు చేయాలని చెప్పారు. నల్లాలకు మోటార్లు బిగిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుక్ చేసిన వెంటనే ట్యాంకర్ డెలివరీ చేసేందుకు ప్రయత్నించాలని, పెండెన్సీ లేకుండా చూడాలని చెప్పారు. ట్యాంకర్ డెలివరీకి సంబంధించిన ఇన్ అండ్ ఔట్ లాగ్ బుక్స్ సరిగ్గా మెయింటెయిన్​చేయాలన్నారు. ఫిల్లింగ్​స్టేషన్ల వద్ద సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు.