శాలివాహన నగర్​లో నల్లాలకు మోటర్లు బిగించిన 8 మందిపై కేసులు

 శాలివాహన నగర్​లో నల్లాలకు మోటర్లు బిగించిన 8 మందిపై కేసులు
  • ఒక్కొక్కరికి రూ.5 వేలు ఫైన్

హైదరాబాద్​సిటీ, వెలుగు: మూసారాంబాగ్ పరిధిలోని శాలివాహన నగర్​లో నల్లాలకు మోటర్లను బిగించిన ఎనిమిది మందిపై వాటర్​బోర్డు కేసులు నమోదు చేసింది. శాలివాహన నగర్ రోడ్ నంబర్ 12, 13,14 ప్రాంతాల్లో ఓ అండ్​ఎం డివిజన్–2 అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా బిగించిన 8 మోటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఫైన్​వేశారు. ఎవరికైనా తక్కువ ప్రెషర్ తో నీటి సరఫరా జరిగినా.. సరఫరాలో సమస్యలు తలెత్తినా.. తమకు దగ్గర్లోని వాటర్​బోర్డు మేనేజర్, డీజీఎం, జీఎంలను సంప్రదించాలని లేదా కస్టమర్ కేర్ నంబర్​155313కు ఫోన్​చేయాలని అధికారులు సూచించారు.