అవసరమైతే ట్యాంక‌‌ర్లు, ఫిల్లింగ్ స్టేష‌‌న్లు పెంచుతం

  • సమ్మర్​ సమీక్షలో వాటర్​ బోర్డు ఎండీ, ఈడీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: వచ్చే వేసవిలో నీటి సమస్య లేకుండా చేసేందుకు అవసరమైతే ట్యాంక‌‌ర్లు, ఫిల్లింగ్ స్టేష‌‌న్లు, ఫిల్లింగ్ పాయింట్లు, నీటి మోతాదు సప్లయ్​పెంచుతామ‌‌ని వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి చెప్పారు. గురువారం ఈడీ మయాంక్​ మిట్టల్ తో కలిసి వేసవిలో నీటి సమస్య పరిష్కారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ అశోక్​మాట్లాడుతూ వేసవిలో నీటి డిమాండ్ ను మ‌‌రింత స‌‌మ‌‌ర్థంగా ఎదుర్కోవాలన్నారు.

గ‌‌తంలో కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోవడంతో అధికంగా ట్యాంక‌‌ర్లు బుక్  చేసుకున్నారని, ఇప్పుడు వారి ఇండ్లల్లో నీటి సమస్యపై స‌‌ర్వే చేప‌‌ట్టామ‌‌న్నారు. వారంతా తప్పని సరిగా ఇంకుడు గుంత‌‌లు నిర్మించుకునేలా చేస్తామన్నారు. ట్యాంకర్ల య‌‌జ‌‌మానుల‌‌తో సమావేశమై వేస‌‌విలో ట్యాంక‌‌ర్ల ప‌‌రంగా ఇబ్బందులు రాకుండా  జాగ్రత్తలు తీసుకోవాల‌‌ని సూచించారు.