- సిబ్బందికి వాటర్‌బోర్డు ఎండీ సూచన
హైదరాబాద్‌సిటీ, వెలుగు : అధికారులు, సిబ్బంది 90 రోజులు కష్టపడితే గ్రేటర్ పరిధిలో మంచి ఫలితాలు వస్తాయని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ను సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీగా, ఇంకుడు గుంతల నగరంగా మార్చుకోవచ్చన్నారు. గురువారం ఆయన కేపీహెచ్ బీ, ఫేజ్-15 కైత్లాపూర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. సీవరేజ్ నిర్వహణను జీహెచ్ఎంసీ వాటర్‌బోర్డుకు అప్పగించిన టైంలో మ్యాన్ హోల్స్రోడ్డుకు కిందికి ఉండేవన్నారు.
అప్పట్లో రోడ్లు వేసే టైంలో సిమెంట్, ఇటుకలతో వాటి ఎత్తును పెంచి, ప్లాస్టరింగ్ పనులు పూర్తి చేయలేదని చెప్పారు. దీంతో ఇప్పుడు మ్యాన్ హోళ్లలో కంకర, ఇసుక చేరి సీవరేజ్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ధ్వంసమైన మ్యాన్ హోళ్లను గుర్తించి కొత్తవి నిర్మించాలని చెప్పారు. కేపీహెచ్ బీలో 6 ప్లాట్లకు ఒక కమ్యూనిటీ సిల్ట్ చాంబర్ ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.