
- రెండు రోజులు అదనంగా పనిచేయాలని ఎండీ ఆదేశం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: వాటర్ట్యాంకర్ల డెలివరీ లేట్ అవుతోందని వస్తున్న ఫిర్యాదులపై ఎండీ అశోక్ రెడ్డి స్పందించారు. డివిజన్ల జీఎంలతో మంగళవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. వరుస సెలవులు రావడం, పండుగలకు ట్యాంకర్డ్రైవర్లు ఊరెళ్లడం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ బుకింగ్ పెండెన్సీ పెరిగినట్టు గుర్తించామన్నారు. షేక్‌పేట, షాపూర్‌నగర్, బుద్వేల్, ఆసిఫ్‌నగర్, ఎన్టీఆర్ నగర్, భవానీ నగర్, చిలకలగూడ, షాపూర్‌నగర్-–2, మౌలాలి, గాజులరామారం, ఎర్రగడ్డ, గచ్చిబౌలి-–2, వెంగళరావునగర్, ఎల్లారెడ్డిగూడ, వెంకటగిరి ఫిల్లింగ్ స్టేషన్ల పరిధిలో వందకు పైగా ట్యాంకర్ పెండెన్సీ ఉందన్నారు.
పెండింగ్ ఆర్డర్లను డెలివరీ చేయడానికి రెండు రోజులు అదనంగా పనిచేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పగటి వేళల్లో గృహ అవసరాలకు.. రాత్రిళ్లు కమర్షియల్ అవసరాలకు ట్యాంకర్లను డెలివరీ చేయాలన్నారు. ఈడీ మయాంక్ మిట్టల్ మాట్లాడుతూ అవసరమైన ఫిల్లింగ్ స్టేషన్లలో ఫిల్లింగ్ పాయింట్స్ పెంచుకోవచ్చని అందుకు ప్రపోజల్స్ సమర్పించాలని ఆదేశించారు.
కొండపాక పంపింగ్ స్టేషన్ పరిశీలన
గ్రేటర్సిటీకి తాగునీటిని సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయ్ప్రాజెక్టులో భాగమైన సిద్దిపేట జిల్లాలోని కొండపాక పంపింగ్ స్టేషన్ ను వాటర్‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఆన్ లైన్మానిటరింగ్ సిస్టమ్(స్కాడా)ను వంద శాతం వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఎల్లంపల్లి నుంచి నగరానికి సరఫరా చేసే ప్రతి నీటిబొట్టును లెక్కించడానికి ఫ్లో మీటర్ ఏర్పాటు చేసి.. ఆ వివరాలు హెడ్డాఫీసులో పర్యవేక్షించేందుకు మీటరింగ్ వ్యవస్థను ఆటోమేషన్ చేయాలని సూచించారు. అత్యవసర సమయంలో పంపులు రిపేర్లు వచ్చినా, కాలిపోయినా స్టాండ్ బై మోటార్లను సిద్ధం చేసుకోవాలన్నారు. పంపింగ్ స్టేషన్ పరిసరాల్లో గార్డెన్, బ్యూటిఫికేషన్పనులు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ట్రాన్స్ మిషన్ జీఎం రాజశేఖర్ ఉన్నారు.