- కాంట్రాక్టర్లకు వాటర్ బోర్డు ఎండీ హెచ్చరిక
హైదరాబాద్‌సిటీ, వెలుగు: క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా పనులు చేయాలని వాటర్‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి కాంట్రాక్టర్లకు సూచించారు. మంగళవారం బోర్డు హెడ్డాఫీసులో యాన్యువల్మెయింటెనెన్స్సిస్టమ్(ఏఎంఎస్) ఏజెన్సీ కాంట్రాక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. కేటాయించిన పనులను ఇన్‌టైంలో పూర్తి చేయాలన్నారు. సీవరేజ్ ఓవర్ ఫ్లో నివారణపై వాటర్‌బోర్డు చేపడుతున్న 90 రోజుల స్పెషల్ డ్రైవ్ లో భాగస్వామ్యం కావాలన్నారు. కాంట్రాక్టర్లు చేసే పనులపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. పనితీరు సరిగాలేని కాంట్రాక్టర్లకు వచ్చే ఏడాది పనులు అప్పగించొద్దని ఆదేశించారు. పని విషయంలో తేడా వస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. డైరెక్టర్ ఆపరేషన్స్-–2 స్వామి, డైరెక్టర్ ఆపరేషన్స్ – 1 విజయరావు, సీజీఎంలు, జీఎంలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అలాగే ఎండీ అశోక్‌రెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటించి సీవరేజ్పనులను పరిశీలించారు.