- పనులను పరిశీలించిన వాటర్ బోర్డు ఎండీ
హైదరాబాద్‌సిటీ, వెలుగు : రెడ్ హిల్స్ రిజర్వాయర్‌కు తాగునీటిని సరఫరా చేసే పైప్లైన్ధ్వంసమైన ఘటనపై వాటర్‌బోర్డు అధికారులు వేగంగా స్పందించారు. రెడ్‌హిల్స్‌లోని 825 ఎంఎం డయా పీఎఎస్సీ గ్రావిటీ మెయిన్ పైప్ లైన్ కు యుద్ధప్రాతిపదికన రిపేర్లు చేపట్టారు. పనులను వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ఆదివారం తనిఖీ చేశారు. తొలగించిన పైపులను వెంటనే అక్కడి నుంచి తరలించాలని, పనులు పూర్తయిన వెంటనే రోడ్డు రిపేర్పనులు చేయాలని ఆదేశించారు.
నీటి సరఫరా, మురుగునీటి నెట్‌వర్క్ కోసం పైప్‌లైన్ల వివరాలను జీఐఎస్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఆదివారం సాయంత్రానికి పనులు పూర్తిచేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు.