- ఇల్లీగల్కనెక్షన్లపై వాటర్‌బోర్డు సీరియస్యాక్షన్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్‌పరిధిలో అక్రమ కనెక్షన్లపై వాటర్‌బోర్డు కొరఢా ఝులిపించనున్నది. ఇల్లీగల్నల్లా, సీవరేజీ కనెక్షన్లుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భావిస్తున్నది. హోటల్స్, హాస్పిటల్స్, బేకరీలు, మాల్స్‌లో సగానికి సగం రూల్స్పాటించడం లేదని, నల్లా, సీవరేజీ కనెక్షన్ల విషయంలో కమర్షియల్యాక్టివిటీస్చేస్తూ డొమెస్టిక్కనెక్షన్ల ఫీజులు కడుతున్నారని గుర్తించారు.
వీరు అప్గ్రేడ్చేసుకోకపోతే అక్రమ కనెక్షన్లుగా పరిగణించి క్రిమినల్కేసులు నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల మెహదీపట్నంలోని కింగ్స్హోటల్లో తనిఖీలు చేయగా అక్రమ సీవరేజీ కనెక్షన్ఉన్నట్టు గుర్తించి కట్‌చేశారు. క్రిమినల్కేసు పెట్టాలని భావించగా, భారీ జరిమాన కట్టడంతో వదిలిపెట్టారు. ఇలా సిటీలో చాలామంది కమర్షియల్యాక్టివిటీస్చేస్తూ అక్రమ సీవరేజీ కనెక్షన్లు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఇక అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ఆఫీసర్లు అక్రమ నల్లా, సీవరేజీ కనెక్షన్లను గుర్తించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయం
గ్రేటర్ పరిధిలో13.80 లక్షల వాటర్ కనెక్షన్లున్నాయి. వీటిలో రికార్డుల ప్రకారం 50 నుంచి 60 వేల కమర్షియల్కనెక్షన్లున్నాయి. వాస్తవానికి మరో 50 వేల వరకు ఇల్లీగల్కమర్షియల్కనెక్షన్లు ఉంటాయని భావిస్తున్నారు. హాస్పిటల్స్, మాల్స్, బేకరీలు, హోటల్స్, ఫంక్షన్‌హాల్స్, క్లబ్బులు తప్పని సరిగా కమర్షియల్ కనెక్షన్లు కలిగి ఉండాలి. సీవరేజీ కనెక్షన్లు కూడా కమర్షియల్ కేటగిరీలోనే ఉండాలి.
కానీ చాలా వరకు డొమెస్టిక్ కేటగిరీలోనే ఉన్నాయి. దీని వల్ల సీవరేజీ లైన్లపై ఒత్తిడి పెరిగి ఓవర్‌ఫ్లో అవుతోంది. అంతే కాకుండా రికార్డుల్లో డొమెస్టిక్సైజు ఉండి, వాస్తవంగా కమర్షియల్కనెక్షన్ఉన్నవి కూడా లక్షకు పైగానే ఉండే అవకాశం ఉందంటున్నారు. రికార్డుల్లో ఒక కనెక్షన్ ఉండి రెండు కనెక్షన్లను కలిగి ఉన్న వారు కూడా నగరంలో అధికంగానే ఉన్నారు. గ్రేటర్‌పరిధిలో దాదాపు ఐదు లక్షల బిల్డింగులు, ప్రాంగణాల్లో సీవరేజీ లైన్లు కమర్షియల్కేటగిరీలో ఉండాల్సి ఉండగా, రెండున్నర లక్షలు కూడా లేవని ఆఫీసర్లు చెప్తున్నారు. తనిఖీల్లో ఇలాంటివి గుర్తిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు క్రిమినల్కేసులు పెడతామంటున్నారు.
వచ్చే వేసవి నాటికి పూర్తి
సీవరేజీ కనెక్షన్ల విషయానికి వస్తే కమర్షియల్కార్యకలాపాలు నిర్వహించే హోటళ్లు, హాస్పిటల్స్, బేకరీలు, ఫంక్షన్‌హాల్స్, మాల్స్ వంటి వాటిలో తప్పని సరిగా సీవరేజీ లైన్కనీసం 6 ఇంచులు, 8 ఇంచుల పైప్‌లైన్‌తో ఉండాలి. కానీ వీటిలో కూడా చాలా వరకు 4 ఇంచుల పైప్లైన్లే ఉంటున్నాయి. అలాగే వారు సెపరేట్‌గా మ్యాన్‌హోల్స్,సిల్ట్ఛాంబర్లను ఏర్పాటు చేసుకోవాలి. కానీ, అధికశాతం వినియోగదారులు నేరుగా వాటర్‌బోర్డుకు చెందిన సీవరేజీ లైన్లకు కనెక్షన్ఇచ్చేస్తున్నారు. ఆ కనెక్షన్ల నుంచి వచ్చే భారీ వ్యర్థాలన్నీ వాటర్‌బోర్డు మ్యాన్‌హోల్స్‌లో చేరి ఓవర్‌ఫ్లో అవుతున్నాయి. వచ్చే వేసవి నాటికి నగరంలో అక్రమ నల్లా కనెక్షన్లు, సీవరేజీ కనెక్షన్లను క్రమబద్ధీకరించి బోర్డు ఆదాయాన్ని కూడా పెంచుకోవాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు.