సీవేజ్​ ఓవర్​ ఫ్లో ఫ్రీ సిటీగా మార్చడమే టార్గెట్.. వాటర్​ బోర్డు ఎండీ అశోక్​రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: మహా నగరాన్ని సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా అక్టోబర్ 2 నుంచి 90 రోజుల స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి తెలిపారు. డ్రైవ్ పై శుక్రవారం ఇన్​స్టిట్యూట్​ఆఫ్ ఇంజినీరింగ్​లో అధికారులకు వర్క్​షాప్​నిర్వహించారు. సీవరేజ్ సమస్యలపై అధిక ఫిర్యాదులు వస్తున్నాయని, శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పారు.

డ్రైవ్ లో సమర్థంగా పనిచేస్తే 30 నుంచి 40% ఫిర్యాదులను తగ్గించవచ్చన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈడీ మయాంక్ మిట్టల్, రెవెన్యూ డైరెక్టర్​వీఎల్ ప్రవీణ్ కుమార్, స్పెషల్​ఆఫీసర్​జాల సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. అంతకుముందు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు.