- గత ఎండాకాలంలో విపరీతమైన డిమాండ్‌తో నీళ్లు పక్కదారి
- రిపీట్ కాకుండా వాటర్‌బోర్డు ప్లానింగ్
- జీపీఎస్‌తో ఎక్కడుంది? ఎప్పుడొస్తుందో తెలుసుకోవచ్చు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్లో వాటర్ ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా అధికారులు ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ట్యాంకర్లను బుక్‌చేసుకున్న వారికి ఇన్‌టైంలో అందకపోవడం, కొన్ని సందర్భాల్లో ఒకరికి బుక్‌చేసిన ట్యాంకర్మరొకరికి పంపించడం లాంటివి జరుగుతున్నాయి. గత ఎండాకాలం వాటర్‌ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ఏర్పడడంతో ట్యాంకర్లను అసలు వినియోగదారులకు చేర్చకుండా ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
కానీ వచ్చే వేసవిలో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు ప్లాన్వేస్తున్నారు. అందుకోసం ఒక యాప్ రూపొందిస్తున్నారు. దీనివల్ల ట్యాంకర్బుక్చేసుకున్న వినియోగదారులు తమ ట్యాంకర్బుకింగ్ఏ స్టేజీలో ఉంది? ఎప్పుడొస్తుంది? లాంటి వివరాలు తెలుసుకోవడంతో పాటు అది బయలుదేరాక ట్రాక్కూడా చేసుకునే వెసులుబాటు కలగనుంది.
వారం రోజుల వరకు నీళ్లందలే..
ప్రస్తుతం గ్రేటర్‌పరిధిలో 750 ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. కానీ ఎండలు ముదిరిన కొద్దీ బోర్‌వెల్స్ ఎండిపోయి ట్యాంకర్లకు డిమాండ్పెరుగుతుంది. గత ఏడాది ఐటీ కారిడార్, హైటెక్‌సిటీ, మాదాపూర్, వట్టినాగుల పల్లి, కొండాపూర్, నార్సింగి, ఔటర్రింగ్రోడ్పరిధిలోని పలు గ్రామాలు, పలు మున్సిపాలిటీల్లో బోర్లు ఎండిపోవడంతో వాటర్‌బోర్డు ట్యాంకర్ల కోసం జనాలు ఎగబడ్డారు. దీంతో రోజుకు 12వేల ట్యాంకర్ల వరకు బుక్అయ్యాయి. బుక్‌చేసుకున్న వారికి వారం పది రోజుల వరకు కూడా నీళ్లందలేదు. ఇలాంటి టైంలో కొందరు ట్యాంకర్ల డ్రైవర్లకు ఎక్కువ డబ్బులిచ్చి వాటర్‌ట్యాంకర్లను తమ వైపుకు మళ్లించుకుని కొనుక్కున్నారు. దీంతో బుక్‌చేసిన వారు వారానికి పైబడి ఎదురుచూడాల్సి వచ్చింది.
యాప్‌తో తిప్పలు తప్పుతయ్
గత వేసవిలో ఏర్పడిన పరిస్ధితిని తప్పించడానికి వాటర్‌బోర్డు ప్రత్యేకంగాట్యాంకర్ ను బుక్‌చేయడానికి , తర్వాత ట్రాక్ చేయడానికి ప్రత్యేక యాప్ రూపొందించే పనిలో పడింది. గత వేసవిలోనే దీని గురించి మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్అధికారులను ఆదేశించగా, ఇప్పుడు వాటర్‌బోర్డు అధికారులు సీరియస్‌గా ఫోకస్‌పెట్టారు. ట్యాంకర్బుకింగ్ట్రాక్యాప్ఇన్స్టాల్చేసుకుంటే వినియోగదారులు ఎప్పుడు, ఏ టైంకు ట్యాంకర్వస్తుంది? బుకింగ్ఏ స్టేజీలో ఉంది? లాంటి వివరాలతో పాటు ట్రాక్చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల పక్కదారి పట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. దీన్ని వచ్చే వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.