లేటెస్ట్ టెక్నాలజీని వాడనున్న వాటర్ బోర్డు

లేటెస్ట్ టెక్నాలజీని వాడనున్న వాటర్ బోర్డు

సికింద్రాబాద్​, వెలుగు: గ్రేటర్ పరిధిలో నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్​మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నుంచి దుర్వాసన రాకుండా కట్టడి చేసేందుకు వాటర్ బోర్డు చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకోవాలని భావిస్తోంది. ఎస్టీపీల నుంచి వెలువడే దుర్వాసనను కట్టడి చేసేందుకు ఈ రంగంలో పనిచేస్తున్న ఢిల్లీ, ముంబై, పుణే, కర్నాటకలోని హోస్పేటకు చెందిన పలు సంస్థల ప్రతినిధులు బుధవారం ఖైరతాబాద్​లోని వాటర్ బోర్డు హెడ్డాఫీసులో సమావేశమయ్యారు. 

దుర్వాసన కట్టడికి ఆయా సంస్థల వద్ద ఉన్న, దిగుమతి చేసుకున్న టెక్నాలజీ గురించి వాటర్ బోర్డు ఎండీ దానకిశోర్ తో పాటు, ఇతర ఉన్నతాధికారులకు వివరించారు. దీనిపై  సమగ్రమైన రిపోర్టును అందించేందుకు ఎస్టీపీల్లో క్షేత్రస్థాయిలో పరిశీంచాలని ఆ ప్రతినిధులకు ఆయన సూచించారు. దీంతో వారు గురువారం ఆయా ఎస్టీపీలను పరిశీలించనున్నారు.  కార్యక్రమంలో వాటర్ బోర్డు ఈడీ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్  డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.