హాలియా పట్టణంలో చలివేంద్రం ప్రారంభం 

హాలియా, వెలుగు : పట్టణంలోని డీవీకే రోడ్ లో సుప్రియ బోర్ వెల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

చలివేంద్రం ఏర్పాటు చేసిన సుప్రియ బోర్ వెల్స్ అధినేత చింతరెడ్డి కోటిరెడ్డిని వారు అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కాకునూరి నారాయణగౌడ్, టౌన్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, జిల్లా నాయకులు గౌని రాజా రమేశ్ యాదవ్, చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చింతారెడ్డి బ్రదర్స్, కున్ రెడ్డి రాఘవరెడ్డి, సాగర్ ప్రసాద్, పాండు నాయక్ పాల్గొన్నారు.