బొట్టు బొట్టుకూ లెక్క పక్కా!..బోర్డుల జ్యూరిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌తో ఏపీ నీళ్ల దోపిడికి చెక్

బొట్టు బొట్టుకూ లెక్క పక్కా!..బోర్డుల జ్యూరిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌తో ఏపీ నీళ్ల దోపిడికి చెక్
  • ప్రతి ఔట్‌‌‌‌లెట్‌‌‌‌ నుంచి తీసుకునే నీళ్లు ఆ రాష్ట్ర ఖాతాలోకి
  • సీఐఎస్‌ ఎఫ్‌ సెక్యూరిటీతో ప్రాజెక్టులపై రాష్ట్రాలకు కళ్లెం
  • పకడ్బందీ వ్యవస్థ తీసుకువచ్చే యోచనలో కేంద్ర జలశక్తి శాఖ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే ప్రతి నీటి బొట్టును పక్కాగా లెక్కించనున్నారు. ఏయే ఔట్‌‌‌‌లెట్‌‌‌‌ నుంచి ఎన్ని నీళ్లు తీసుకున్నారు..? సీజన్‌‌‌‌లో ఎంత నీటిని ఉపయోగించుకున్నారు..? అనే దానిపై స్పష్టమైన లెక్కలతో ఆయా రాష్ట్రాల ఖాతాలో వివరాలు నమోదు చేయనున్నారు. బోర్డుల జ్యూరిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌తో నీటి వినియోగం, ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద, దిగువకు వచ్చే నీళ్లు ఇలా అన్ని వివరాలను పకడ్బందీగా రికార్డు చేయనున్నారు. ప్రాజెక్టులు, ఔట్‌‌‌‌ లెట్ల వద్ద సీఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ సెక్యూరిటీతో వాటిపై రాష్ట్రాల ఆధిపత్యానికి చెక్‌‌‌‌ పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రివర్‌‌‌‌ బోర్డులకు జ్యూరిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌తో పకడ్బందీ వ్యవస్థను తీసుకువచ్చేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రయత్నిస్తున్నది. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే ఏపీ నీళ్ల దోపిడీకి చెక్‌‌‌‌ పడినట్టు అవుతుంది.

అన్నీ బోర్డు పరిధిలోకే!

కృష్ణా నదిపై కామన్‌‌‌‌ ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్​ను కృష్ణా బోర్డే నిర్వహించనుంది. శ్రీశైలం ప్రాజెక్టు రివర్‌‌‌‌ స్లూయిజ్‌‌‌‌లు, పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌, హెచ్‌‌‌‌ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌, ముచ్చుమర్రి, కల్వకుర్తి లిఫ్ట్‌‌‌‌ స్కీములతో పాటు రైట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌, లెఫ్ట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ పవర్‌‌‌‌ హౌస్‌‌‌‌లకు నీటి విడుదలను బోర్డే రెగ్యులేట్‌‌‌‌ చేయనుంది. పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ నిర్వహణ ఇప్పుడు ఏపీ ఆధీనంలో ఉండగా జ్యూరిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌ వస్తే అది బోర్డు పరిధిలోకి రానుంది. హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ నుంచి తరలించే నీళ్లను పక్కాగా రికార్డు చేసి ఏపీ వినియోగ లెక్కల్లో నమోదు చేస్తారు. లిఫ్ట్‌‌‌‌ స్కీముల మోటార్ల నిర్వహణ కూడా బోర్డు ఆధీనంలోకే రానుంది. పవర్‌‌‌‌ హౌస్‌‌‌‌లకు నీటి విడుదల, ఆ నీటిని తిరిగి రివర్సబుల్‌‌‌‌ మోటార్ల ద్వారా ఎత్తి ప్రాజెక్టులోకి పోయాలా..? నది ద్వారా నాగార్జునసాగర్‌‌‌‌కు విడుదల చేయాలా..? అనే విషయాన్ని బోర్డే నిర్దారిస్తుంది. నాగార్జునసాగర్‌‌‌‌ కుడి, ఎడమ కాలువల హెడ్‌‌‌‌ రెగ్యులేటర్ల నిర్వహణను బోర్డే పర్యవేక్షిస్తుంది. రెండు కాలువలకు రోజువారీగా విడుదల చేసే నీటిని లెక్కల్లో నమోదు చేస్తుంది. సాగర్‌‌‌‌ ఎడమ, కాలువ పరిధిలోని 16,  17 బ్రాంచ్‌‌‌‌ కెనాళ్లు, మంగాపూరం ఆఫ్‌‌‌‌ టేక్‌‌‌‌, బోనకల్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌ కెనాల్‌‌‌‌, మధిర బ్రాంచ్‌‌‌‌ కెనాల్‌‌‌‌, తిరువూర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ టేక్స్‌‌‌‌, కాకర్ల ఆఫ్‌‌‌‌ టేక్స్‌‌‌‌, తెలంగాణ – ఏపీ సరిహద్దుల్లోని 21వ ఎంబీసీ కెనాల్‌‌‌‌కు చేరే నీళ్లు, నీటి వినియోగాన్ని నమోదు చేయనుంది. కుడి, ఎడమ కాలువల ద్వారా మెయిన్‌‌‌‌ పవర్‌‌‌‌ హౌస్‌‌‌‌లకు విడుదల చేసే నీటి రెగ్యులేషన్‌‌‌‌ బాధ్యతలు కూడా బోర్డు చేతిలోనే ఉంటాయి. ఏఎమ్మార్పీ ఎస్‌‌‌‌ఎల్బీసీ ద్వారా తీసుకునే నీటిని సైతం బోర్డు పర్యవేక్షణలోనే విడుదల చేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఆధీనంలోని జూరాల ప్రాజెక్టు, కర్నాటకలోని ఆర్‌‌‌‌డీఎస్‌‌‌‌, ఏపీలోని సుంకేసుల బరాజ్‌‌‌‌, ఏపీకి నీళ్లు ఇచ్చే తుంగభద్ర హైలెవల్‌‌‌‌, లోలెవల్‌‌‌‌ కాలువలు, నాగార్జునసాగర్‌‌‌‌ టెయిల్‌‌‌‌పాండ్‌‌‌‌, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీలకు వచ్చే వరద, దిగువకు విడుదల చేసే నీళ్లు, ఆయా ప్రాజెక్టుల కాలువలు, ఇతర ఔట్‌‌‌‌లెట్ల ద్వారా తరలించే నీటిని బోర్డే పర్యవేక్షించనుంది. ప్రకాశం బ్యారేజీకి పోలవరం నుంచి డైవర్ట్‌‌‌‌ చేసే గోదావరి నీళ్లను బోర్డు లెక్కించనుంది. యేటా ఎంతమేరకు గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్‌‌‌‌లో ఏపీ ఉపయోగించుకుంటుందో పక్కగా లెక్కలోకి రానుంది. మీడియం ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టుల ద్వారా తీసుకునే నీళ్లను సైతం టెలిమెట్రీల ద్వారా బోర్డు పర్యవేక్షిస్తుంది.

ఇంజనీర్లు,సిబ్బంది బోర్డు పరిధిలోకి

కామన్‌‌‌‌ ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టుల ఆపరేషన్‌‌‌‌, మెయింటనెన్స్‌‌‌‌, ఔట్‌‌‌‌ లెట్ల బాధ్యతలు చూస్తున్న ఇంజనీర్లు ప్రస్తుతం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్నారు. బోర్డుల జ్యూరిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌ నోటిఫై చేశాక ఇంజనీర్లతో పాటు వర్క్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్లు, లష్కర్‌‌‌‌లు బోర్డు ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుంది. సంబంధిత రాష్ట్రం ఇంజనీర్లతో పాటు సంబంధిత సిబ్బంది డిప్యూటేషన్‌‌‌‌పై ఆయా రివర్‌‌‌‌ బోర్డుల్లో పనిచేయాల్సి ఉంటుంది.

ఫస్ట్​ కేఈఆర్​ఎంబీపై ఫోకస్​

కృష్ణా నదిపై మాత్రమే కామన్‌‌‌‌ ప్రాజెక్టులు ఉండటంతో మొదట కేఆర్‌‌‌‌ఎంబీ జ్యూరిస్‌‌‌‌ డిక్షన్‌‌‌‌పైనే  ఫోకస్‌‌‌‌ చేస్తున్నారు. గోదావరి నీటి పంపకాలపై వివాదాలున్నా నదిలో నీటి లభ్యతకు ఇబ్బంది లేకపోవడంతో జీఆర్‌‌‌‌ఎంబీ (గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు) జ్యూరిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌ కాస్త ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. గోదావరి నదిపై రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు, పంపుహౌస్‌‌‌‌లను బోర్డు అధీనంలోకి తీసుకురావడంతో పాటు వాటిపై సీఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ సిబ్బందితో భద్రత కల్పించడం, టెలిమెట్రీల ఏర్పాటు తదితర అంశాలతో గోదావరి బోర్డు డ్రాఫ్ట్‌‌‌‌ జ్యూరిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌ రూపొందించనున్నట్టు తెలిసింది.