నాగార్జున సాగర్ డ్యాంలో నీటి కుక్కల సందడి

నాగార్జున సాగర్ డ్యాంలో నీటి కుక్కల సందడి

నల్గొండ హాలియా వెలుగు : జలాశయాల్లో అరుదుగా కనిపించే నీటి కుక్కలు నాగార్జునసాగర్ డ్యాంలో శుక్రవారం సందడి చేశాయి. సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రం ఎదుట సందర్శకులను కనువిందు చేశాయి. 

ఇటు భూమిపై అటు నీటిలో ఉండగలిగే ఉభయచరాల్లో నీటి కుక్కలు కూడా ఒకటి.  వేసవికాలం కావడంతో నదిలో సరదాగా ఈత కొడుతూ సేద తీరాయి.