మూడు గేట్లు ఎత్తి నీటి విడుదల
మరో రెండు రోజుల్లో నాగార్జునసాగర్ నిండే అవకాశం
హైదరాబాద్, వెలుగు: వానలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులకు పైగా నీళ్లను దిగువకు వదులుతున్నారు. కృష్ణా బేసిన్ లోని ఎగువ ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్ కు భారీ వరద కొనసాగుతోంది.వచ్చిన నీళ్లను వచ్చినట్టు కిందికి వదులుతున్నారు. బుధవారం సాయంత్రానికి జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి మూడున్నర లక్షల క్యూ సెక్కులకుపైగా వరద శ్రీశైలంలోకి వస్తోంది. శ్రీశైలం నుంచి వదుల్తున్న నీళ్లతో నాగార్జున సాగర్ మరో రెండు రోజుల్లో పూర్తిగా నిండిపోనుంది. ఇక గోదావరి బేసిన్ లో ఎస్సారెస్పీకి నిలకడగా ప్రవాహాలు వస్తున్నాయి. ఎల్లంపల్లికి కాస్త వరద తగ్గింది. కడెం, ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారే జీల గేట్లన్నీ ఎత్తడంతో నీళ్లు కిందికి వెళ్లిపోతున్నాయి.
ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు (టీఎంసీల్లో ).. ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో (క్యూసెక్కుల్లో )
ప్రాజెక్టు పూర్తి నిల్వ ప్రస్తుత నిల్వ ఇన్ ఫ్లో ఔట్ ఫ్లో
కృష్ణా బేసిన్ లో..
ఆల్మట్టి 129.72 101.93 2,37,437 2,50,000
నారాయణపూర్ 37.64 27.48 2,80,000 2,83,525
జూరాల 9.66 8.63 3,17,000 3,16,258
తుంగభద్ర 100.86 96.49 66,638 66,638
శ్రీశైలం 215.81 195.2 3,48,125 1,50,452
నాగార్జు నసాగర్ 312.05 260.59 1,50,452 17,658
గోదావరి నది బేసిన్ లో..
శ్రీరాంసాగర్ 90.31 61.77 53,330 832
మిడ్ మానేరు 25.87 21.66 1,784 6,384
ఎల్‌ఎండీ 24.07 19.57 5,560 285
కడెం 7.60 6.86 9,721 6,315
ఎల్లంపల్లి 20.18 19.06 33,295 32,636