వచ్చే సీజన్​లో గౌరవెల్లి నుంచి నీళ్లు: పొన్నం

వచ్చే సీజన్​లో గౌరవెల్లి నుంచి నీళ్లు: పొన్నం

వచ్చే సీజన్ కల్లా గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ‘‘కేసీఆర్ సీఎం అయ్యాక గౌరవెల్లి ప్రాజెక్ట్ కుర్చీ వేసుకుని కడతానని చెప్పారు. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ హోదాలో 2023 మార్చి 2న గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించారు. 

అధికారంలోకి రాగానే ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. భూసేకరణ పూర్తి చేసి, కాలువల నిర్మాణం వేగవంతం చేస్తాం” అని పేర్కొన్నారు. హుస్నాబాద్ ప్రాంత రైతుల కల నెరవేరుతున్నదని అన్నారు. 317 జీవో, 46 జీవో సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. 2008, 1998 డీఎస్సీ అంశంపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.