నీళ్లు, నిధులు, నియామకాలు.. పత్తా లేకుండా పోయినయ్.. : యోగి ఆదిత్యనాథ్

  • ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు: యోగి ఆదిత్యనాథ్

రాజన్నసిరిసిల్ల/ఆసిఫాబాద్/కాగజ్ నగర్,వెలుగు: కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవే రలేదని, మిగులు బడ్జెట్​తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ఉద్యమంలో త్యాగాలు చేసినవారిని కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. నీళ్లు, నిధులు, నియా మకాల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో ఈ మూడు అడ్ర స్ లేకుండా పోయాయని విమర్శించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో యోగి మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నాయన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు అద్భుతమైనవి అని చెప్పారు.  

నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నరు

పేపర్ లీకేజీ చేస్తూ నిరుద్యోగుల జీవితాలను కేసీఆర్ నాశనం చేశారని యోగి మండిపడ్డారు. యూత్ లైఫ్​తో చెలగాటమాడిన కేసీఆర్​ను ఇంటికి పంపాలన్నారు. సిర్పూర్​లో బీఎస్పీ పోటీ చేస్తున్నదని కేవలం ఓట్లు చీల్చేందుకే అని విమర్శించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ కామన్ ఫ్రెండ్ ఎంఐఎం

బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు ఒకటే అని, వీళ్ల కామన్ ఫ్రెండ్ ఎంఐఎం అని యోగి ఆదిత్యనాథ్ విమ ర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ లీడర్ల మీద పెట్టిన అక్రమ కేసుల లెక్క మొత్తం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక చూస్తుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందన్నారు.

డబుల్ ఇంజిన్ సర్కార్​తోనే రాష్ట్రం సేఫ్

హైదరాబాద్, వెలుగు: డబుల్ ఇంజిన్ సర్కా ర్​తోనే రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. హైదరాబాద్​ను భాగ్య నగరంగా మార్చే చాన్స్​ వచ్చిందని, దీని కోసం ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. సనత్​నగర్ నియోజకవర్గంలోని మోండా మార్కెట్ రోడ్​షోలో ఆయన మాట్లాడారు. రజాకార్ల నుంచి తెలంగాణకు విముక్తి లభించినా.. విమోచన దినాన్ని నిర్వహించలేని స్థితిలో బీఆర్ఎస్ ఉందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన అంతం చేయాలన్నారు.