శ్రీశైలం పంప్ హౌస్లో వాటర్ లీక్.. వారం రోజులుగా సమస్య

శ్రీశైలం పంప్ హౌస్లో వాటర్ లీక్.. వారం రోజులుగా సమస్య

అమ్రాబాద్, వెలుగు: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్  కేంద్రంలో వారం రోజులుగా వాటర్  లీక్  అవుతోంది. 1వ యూనిట్ లోని డ్రాఫ్ట్  ట్యూబ్  జీరో ఫ్లోర్ లో వాటర్  లీక్  అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, నెల రోజులుగా పంప్  మోడ్  పద్ధతిలో విద్యుత్  ఉత్పత్తి జరుగుతోంది. పంప్  మోడ్ లో టర్బైన్స్  వేగంగా తిరగడంతో డ్రాఫ్ట్  ట్యూబ్  జీరో  ఫ్లోర్  స్లాబ్  నుంచి డిసెంబర్ 25న నీటి చుక్కలు కారడం గుర్తించిన అధికారులు.. అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. 

సర్జ్  ఛాంబర్, ఫెన్స్​టాక్  గేట్లను మూసేసి, టర్బైన్లలో నీటి నిల్వ పూర్తిగా తొలగిస్తే తప్ప లీకేజీ అవుతున్న ప్రాంతాన్ని గుర్తించలేమని అధికారులు వెల్లడించారు. నీటి లీకేజీని అరికట్టకపోతే స్లాబ్  కూలిపోయే ప్రమాదం ఉందని కొందరు ఇంజనీర్లు, మాజీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ ప్రాంతాన్ని సీఈ నారాయణ పరిశీలించి నివేదిక అందించాలని స్థానిక ఇంజనీర్లను ఆదేశించినట్టు సమాచారం. సమస్య పరిష్కారానికి అవసరమైన నిపుణులతో చర్చిస్తున్నట్టు కో సివిల్  ఎస్ఈ రవీంద్ర కుమార్  తెలిపారు.