
- 42.5 అడుగులకు తగ్గిన నీటిమట్టం
- వరద తగ్గడంతో శానిటేషన్ పనులు మొదలు పెట్టిన సిబ్బంది
భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గిపోవడంతో ఆఫీసర్లు ప్రమాదహెచ్చరికలను ఉపసంహరించారు. వర్షాలు తగ్గడం, ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో ప్రవాహం తగ్గింది. గరిష్టంగా 50.6 అడుగులకు చేరిన నీటిమట్టం బుధవారం నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. బుధవారం రాత్రి 10 గంటలకు 47.5 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.
గురువారం 42.5 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించారు. వరద ప్రవాహం తగ్గడం, వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున శానిటేషన్, స్నానఘట్టాల క్లీనింగ్ పనులను మొదలు పెట్టారు.