ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న నీటిమట్టాన్ని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు వరద నీరు ఇన్ ఫ్లో 18518క్యూసెక్కులు ఉందని తెలిపారు. ఔట్ ఫ్లో 503 క్యూసెక్కులుగా నమోదయిందన్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 80.5 టిఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం 1067.20 అడుగులు 18.950టీఎంసీలుగా ఉందని తెలిపారు. కాగా గతేడాది ఇదే సమయానికి 1075.20 అడుగులు 33 టిఎంసీలుగా ఉందని పేర్కొన్నారు.