గ్రౌండ్ వాటర్ కి నో ప్రాబ్లమ్
సమ్మర్‌కు ఢోకా లేదంటున్న అధికారులు
శివారుల్లో పెరుగుతున్న సమస్య
హైదరాబాద్, వెలుగు: ఈ సమ్మర్లో హైదరాబాద్ సిటీలో గ్రౌండ్‌వాటర్ కు ఢోకా లేదని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఓల్డ్‌సిటీలోని కొన్ని ఏరియాలు మినహా అన్నిచోట్లా నీరు ఉన్నట్లు గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. ఈసారి ఎండలు తక్కువ ఉంటాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాత్రం వాటర్ లెవల్స్ పడిపోతున్నాయి.
మారేడ్ పల్లిలో అత్యధికం
లాస్ట్ఇయర్ మార్చితో పోలిస్తే గత నెలలో ఆసిఫ్ నగర్, చార్మినార్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ ఏరియాల్లో గ్రౌండ్ వాటర్ లెవల్స్ స్వల్పంగా తగ్గాయి. మిగతా అన్ని ప్రాంతాల్లోనూ పెరిగాయి. గతేడాది మారేడ్ పల్లిలో 23.08 మీటర్లలోతుకు పడిపోగా, ఈ ఏడాది 8.91 మీటర్లకు పెరిగింది. వర్షపాతంతోపాటు ఇంకుడు గుంతలతో ఇక్కడ గ్రౌండ్ వాటర్ లెవల్ పెరిగినట్లు అధికారులు తెలిపారు.
గ్రేటర్ పరిధిలో….
మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల కంటే హైదరాబాద్లోనే గ్రౌండ్ వాటర్ లెవల్స్ బాగా ఉన్నాయి. గతేడాది మార్చిలో సిటీలో సగటున 10.15 మీటర్లలో నీళ్లు ఉండగా, గత నెలలో 9.39 మీటర్లలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో సగటున 17.96 మీటర్లు ఉండగా, ఈసారి 16.78 మీటర్లు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 15.72 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 12.35 మీటర్లుగా ఉన్నాయి. శివారు ప్రాంతాల్లోనే గణనీయంగా వాటర్ లెవల్స్ బాగా పడిపోయాయి. ఇక్కడ విపరీతంగా బోర్లు వేయడంతోపాటు నీటి వినియోగమూ పెరిగింది. వర్షాకాలంలో భూగర్భంలోకి ఇంకుతున్న నీరు కూడా 8 –10 శాతం లోపే ఉంటోంది.
For More News..