రామడుగు, వెలుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి రాజరాజేశ్వర(మిడ్‌మానేరు)డ్యామ్‌కు నీటిని మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్ట్ పంప్‌హౌజ్ ఆఫీసర్లు విడుదల చేశారు.
రెండు భారీ మోటర్ల ద్వారా గ్రావిటీ కెనాల్లోనికి నీటిని విడుదల చేయగా వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఆర్ డ్యామ్‌లోకి ప్రవేశించాయి. 3,300 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు.