ఎమ్మెల్యే వివేక్ ​చొరవతో తీరిన నీటి కష్టాలు

ఎమ్మెల్యే వివేక్ ​చొరవతో తీరిన నీటి కష్టాలు
  • మూడు చోట్ల బోర్​వెల్స్​ ప్రారంభం
  • కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు, స్టూడెంట్లు

కోల్​బెల్ట్, వెలుగు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో చెన్నూర్ మండలం కిష్టంపేట డిగ్రీ కాలేజ్, కొమ్మెరలోని హైస్కూల్, జైపూర్​ మండలం వేలాలలోని హెల్త్​ సెంటర్​ వద్ద తాగునీటి కష్టాలు తీరాయి. దీంతో విద్యార్థులు, రోగులు, హెల్త్​ సిబ్బంది, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పర్యటన సందర్భంగా తాగునీటి సౌలత్​లు లేక వారు పడుతున్న ఇబ్బందులను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. 

సమస్యను పరిష్కరించాలని గత పాలకులు, అధికారులకు అనేక సార్లు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే వివేక్​ మూడు చోట్ల బోర్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తూ సంబంధిత ఆర్​డబ్ల్యూఎస్ ​డీఈ విద్యాసాగర్​ను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో డీఎంఎఫ్​టీ ఫండ్స్​తో మూడు బోర్లు వేశారు. బోర్​వెల్స్​కు ఆదివారం మోటార్లను బిగించి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కాంగ్రెస్​ సీనియర్ ​లీడర్ ​హేమవంత్ ​రెడ్డి తెలిపారు. 

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చుతూ కాకా కుటుంబం నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తోందన్నారు. ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఇచ్చిన హామీ నెరవేర్చుతూ తాగునీటి కష్టాలు తీర్చారని గ్రామస్తులు, విద్యార్థులు ఆనందం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.